● పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ యశ్వంత్ కుమార్ రెడ్డి ● తొలిరోజు 10,530 మంది రెగ్యులర్ విద్యార్థుల హాజరు
పార్వతీపురం రూరల్: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం పకడ్బందీగా ప్రారంభమయ్యాయి. పార్వతీపురంలోని డీవీఎం హైస్కూల్ పరీక్షా కేంద్రాన్ని జేసీ సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి పరీక్షించారు. తెలుగు పరీక్ష నిర్వహణ తీరు, సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా వ్యాప్తంగా 68 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 10,561 మంది రెగ్యులర్ విద్యార్థులకు 10,530 మంది హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. ప్రైవేటు విద్యార్థులు 14 మందికి 7గురు హాజరయ్యారు.
ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం
జిల్లాలో ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు కూడా సోమవారం ప్రారంభమయ్యాయి. తెలు గు (205), ఒరియా (233) సబ్జెక్టులకు సంబంధించి మొత్తం 7 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వీటికి మొత్తం 522 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 483 మంది హాజరయ్యారని, 39 మంది గైర్హాజరైనట్లు డీఈఓ పి.బ్రహ్మాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు.
విజయనగరం కలెక్టరేట్: రీఫ్ 2025–26 సీజన్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ జిల్లాలో ఈ నెల 28 వరకు రైతుసేవా కేంద్రాల నుంచి కొనుగోలు చేస్తామని జేసీ ఎస్.సేతుమాధవన్ తెలిపారు. జిల్లాలోని 367 ఆర్‌ఎస్‌కేల నుంచి 4.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొను గోలు చేసినట్లు వెల్లడించారు. రైతులకు రూ.974 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు. జిల్లాలో 88,877 మంది రైతులు లబ్ధి పొందారని జేసీ వివరించారు.


