ఉద్యోగాల పేరుతో యువతకు మస్కా | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల పేరుతో యువతకు మస్కా

Mar 17 2026 7:48 AM | Updated on Mar 17 2026 7:48 AM

ఉద్యోగాల పేరుతో యువతకు మస్కా ●మా పరిస్థితి ఏమిటో..

గ్రామ పంచాయతీల్లో ‘స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర’ ఉద్యోగాల పేరిట బురిడీ ఒక్కొక్కరి నుంచి పోస్టునుబట్టి రూ.1.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు నియామక పత్రాలు అందజేత జీతాలు అడిగితే ఎవరు నియమించారంటూ ఎదురు ప్రశ్న లబోదిబోమంటున్న గిరిజన నిరుద్యోగులు

ఏం చేయాలో అర్థం కావడం లేదు..

మోసపోయాం..

వారంతా అమాయక గిరిజనులు. ఏదో ఒక పనిచేసి బతుకుదామని ఆశపడ్డారు. ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’లో భాగంగా తడిపొడిచెత్తపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్యోగాలని చెబితే చేరేందుకు ఆసక్తిచూపారు. దీనిని శ్రీ శబరి నిరుద్యోగ పారిశుద్ధ్య వర్కర్స్‌ యూనియన్‌కు చెందిన ఓ ముగ్గురు సభ్యులు సొమ్ము చేసుకునేందుకు పక్కాస్కెచ్‌ వేశారు. ఉద్యోగాలంటూ ఊరించి పోస్టును బట్టి సొమ్ముదండేశారు. ఐదారునెలలుగా గిరిజన నిరుద్యోగులు విధులు నిర్వహిస్తున్నా జీతాలు ఇవ్వకపోవడంతో... మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు. తమకు ఇచ్చిన నియామకపత్రాలను చూపిస్తూ కన్నీరుపెడుతున్నారు. ఇలాంటి మోసం ఎన్నడూ చూడలేదు బాబూ అంటూ అధికారుల వద్ద గోడు వెళ్లబోస్తున్నారు.

కువలు, బిన్‌ బ్యాగ్‌ పద్ధతిలో చెత్త సేకరణపై అవగాహన కల్పించే బాధ్యతను శ్రీ శబరి నిరుద్యోగ పారిశుద్ధ్య వర్కర్స్‌ సంఘానికి అప్పగించారు. ఇదే విషయమై గతేడాది అక్టోబర్‌ నెలలో డీపీవో నుంచి వచ్చిన సర్క్యులర్‌ను చూపిస్తూ.. కేవలం గిరిజన యువతకే ఈ అవకాశమంటూ మస్కా కొట్టారు. శానిటేషన్‌ వర్కర్స్‌ యూనియన్‌ పేరిట నియామక పత్రాలిచ్చారు. బీవీవీఎస్‌ సత్యనారాయణమూర్తి, మజ్జి నారాయణరావు, కొండగొర్రి కృష్ణారావు ఇందులో కీలకంగా వ్యవహరించినట్లు బాధితుల ఆరోపణ. ఒక్కొక్కరి వద్ద పోస్టును బట్టి రూ.1.70 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారు. సూపర్‌వైజర్‌, మండల సమన్వయకర్త, జిల్లా సమన్వయకర్త, ఫీల్డ్‌ మేనేజర్‌ అంటూ కొన్ని పోస్టులిచ్చారు. ఇలా ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే 75 మంది వరకు డబ్బులు కట్టారు. ఇలా నియామక పత్రాలతో ఆయా మండలాల్లో అధికారుల వద్దకు వెళ్తే.. అప్పటికే డీపీవో నుంచి ఆదేశాలు రావడంతో విధుల్లో చేర్చుకున్నారు. నాలుగు నెలలైతేనే గానీ తామంతా మోసపోయినట్లు బాధితులు గుర్తించలేకపోయారు. నాలుగు మండలాల్లోనే రూ.అర కోటికిపైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

సాక్షి, పార్వతీపురం మన్యం:

‘తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించేందుకు శ్రీ శబరి నిరుద్యోగ పారిశుద్ధ్య వర్కర్స్‌ సంఘం (అనపర్తి మండలం, తూర్పుగోదావరి) జిల్లా వారు విచ్చేసిన సమయంలో సదరు గ్రామ పంచాయతీల్లోని దుకాణ యజమానులు– సర్పంచ్‌లతో సమావేశం ఏర్పాటు చేయడం గురించి..’ అంటూ గతేడాది అక్టోబర్‌ నెలలో జిల్లా పంచాయ తీ అధికారి నుంచి కురుపాం, వీరఘట్టం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురం, మక్కువ, జియ్య మ్మవలస ఉప మండల పరిషత్తు అభివృద్ధి అధికారులకు ఓ సర్క్యులర్‌ వెళ్లింది. ఆయా మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఐఈసీ బృంద సభ్యుల సందర్శన సమయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని అందులో డీపీవో పేర్కొన్నారు. ఇదే లేఖను చూపిస్తూ.. కొంతమంది ప్రబుద్ధులు ఉద్యోగాలు సృష్టించారు. గిరిజన యువతే ప్రధాన లక్ష్యంగా రూ.లక్షలు వసూలు చేశారు. ఎంత జీతం ఇవ్వనున్నామో వివరిస్తూ, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు కూడా ఇచ్చేశారు. వారితో రూ.లక్షకు ఈ స్టాంప్‌తో అఫిడవిట్‌ కూడా చేయించారు. గిరిజన నిరుద్యోగులు ఈ ఉత్తర్వులు చూపిస్తూ.. పంచాయతీల్లో ‘విధులకు’ వెళ్లిపోయారు. నాలుగైదు నెలలుగా పని చేస్తున్నారు. జీతం గురించి అడిగితే.. ఎవరికీ తెలియదంటున్నారు. చివరికి డీపీవోను వచ్చి కలిస్తే.. ‘ప్రభుత్వం నుంచి ఎలా వస్తుంది? మిమ్మల్ని ఎవరు నియమించారో వారిని అడగండి’ అంటూ సమాధానం రావడంతో వారంతా అవాక్కయ్యారు. సంస్థ ప్రతినిధులను అడిగితే పొంతన లేని జవాబు లు చెబుతున్నారు. దీంతో బాధితులంతా లబోది బోమంటున్నారు. ఒకరిద్దరు కాదు.. కురుపాం,

సూపర్‌వైజర్‌ ఉద్యోగం.. రూ.17 వేల జీతమంటే ఆశపడ్డాం. ఎల్విన్‌పేట పంచా యతీలో పనిచేస్తున్నా. ఉద్యో గం ఆశ చూపి నా దగ్గర రూ. 2.55 లక్షల వరకు వసూలు చేశారు. మూడు నెలలుగా పనిచేస్తున్నా జీతం లేదు.. మోసపోయామని గ్రహించాం. అధికారులే మా డబ్బులిప్పించాలి.

– కిల్లక కమలప్రియ, గుమ్మలక్ష్మీపురం మండలం

జియ్యమ్మవలస, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోనే 75 మంది వరకు ఉన్నారు. వీరితో నాలుగైదు నెలలుగా పనులు చేయించుకున్నారు. మిగిలిన మండలాల్లోనూ తమలాంటి బాధితులున్నారని వారంతా చెబుతున్నారు.

రూ.లక్షల్లో వసూలు

స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తడి చెత్త–పొడి చెత్త సేకరణ, తీసుకోవాల్సిన మెల

ఉద్యోగమంటే ఆశ పడ్డాం. ఆరు నెలలుగా జిల్లా కోఆర్డినేటర్‌ హోదాలో పని చేస్తున్నా. మోసపోయామని గ్రహించాం. కలెక్టర్‌ వద్దకు వచ్చి కలిశాం. ఎస్పీ కార్యాలయానికి వెళ్లమన్నారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం.

– రామకృష్ణ, చిలకలవానివలస,

జియ్యమ్మవలస మండలం

అదనపు డిస్ట్రిక్ట్‌ కోఆర్డినేటర్‌ అంటూ నియామక పత్రం ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ మని ఆశపడి, అడిగినంత డబ్బులు కట్టాం. ముగ్గురు వ్యక్తులు కీలకంగా వ్యవహరించారు. నేను రూ.1.70 లక్షలిచ్చా. నా లుగు నెలల నుంచి పని చేస్తున్నా. జీతాలు లేవు. అడిగితే ఎవరికీ సంబంధం లేదంటున్నారు.

– రాఘవేంద్రరావు, దిగువమండ,

గుమ్మలక్ష్మీపురం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement