విచారణ చీకట్లోకి! | - | Sakshi
Sakshi News home page

విచారణ చీకట్లోకి!

Mar 17 2026 7:48 AM | Updated on Mar 17 2026 7:48 AM

విచారణ చీకట్లోకి!

నిబంధనల ప్రకారం ప్రతి ఎకరాకు 70 మొక్కలు, మరణించిన మొక్కల స్థానంలో మరో 14 మొక్కలు ఇవ్వాలి. ప్రతి మొక్కకూ రూ.28 ధర నిర్ణయించగా.. ఎరువుల కోసం ఒక్కో మొక్కకు రూ.25 చెల్లించాల్సి ఉంది. 2017–18లో చెల్లించాల్సిన రూ.25ల్లో కేవలం రూ.12 మాత్రమే చెల్లించి, మిగిలిన నిధులు పక్కదారి పట్టించారన్నది ప్రధాన ఆరోపణ.

●2018–19లో ఎరువుల కోసం చెల్లించాల్సిన మొత్తం కూడా రైతులకు ఇవ్వలేదు. ఆ లెక్కన రూ.1.33 కోట్లకుపైగా నిధులు గల్లంతయ్యాయన్నది ఆరోపణ. మొక్కల కొనుగోలులోనూ అవినీతి చోటుచేసుకుంది. ప్రభుత్వం రూ.28 చొప్పున మంజూరు చేస్తే.. రూ.15– రూ.16కే కొనుగోలు చేసి మిగలిన మొత్తం స్వాహా చేశారన్న ఆరోపణలు వచ్చాయి. మూడు సంవత్సరాలపాటు ఇవ్వాల్సిన నిర్వహణ ఖర్చులను సైతం.. ఏడాదికే చెల్లించి, మిగిలిన మొత్తం దోచేశారన్నది ప్రధానంగా వినిపించింది. విచారణ అధికారి సుధారాణి.. పలు అంశాల్లో అవినీతి జరిగినట్లు గుర్తించారు. కొన్ని ఆరోపణలను ఖండించేలా ఎటువంటి ఆధారాలూ సమర్పించలేదని సమాచారం. ఇదే విషయమై తన నివేదికలో ఆమె స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది.

●2017–18 సంవత్సరంలో 2,098 ఎకరాల విస్తీర్ణంలో తోటల పెంపకం చేపట్టారు. సమ్మతి ఇచ్చిన కొంతమంది రైతులు గుంతలు వేయడానికి ముం

దుకు రాలేదు. 2,098 ఎకరాల విస్తీర్ణంలో గుంతల చెల్లింపులు జరిగాయని పత్రాలను సమర్పించలేకపోయారు. విచారణ అధికారికి ఆర్థిక లావాదేవీలను ధ్రువీకరించేలా ఎటువంటి ఆధారాలూ చూపలేదు. విచారణ సమయంలో ఎటువంటి రికార్డులూ అందంచలేదని తెలిసింది.

●ఎరువుల సరఫరా సంస్థకు చేసిన చెల్లింపు, తోటల పరిస్థితి సరిపోలలేదు. 2018–19 సంవత్సరానికి కిలోకు రూ.12 చొప్పున 108.941 మెట్రక్‌ టన్నుల ఎరువును సరఫరా చేయడానికి ఇండెంట్‌ పెట్టినట్లు తెలిసింది. 2017–18లో ఎరువుకు కిలోకు రూ.6 ధర నిర్ణయించగా.. దీనికి విరుద్ధంగా 2018–19 సంవత్సరానికి కిలోకు రూ.12 చొప్పున కొటేషన్లు పొందారు. రెట్టింపు మొత్తం అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లలేనట్లు తెలిసింది.

●చాలా వరకు పనులకు, ఇతర కార్యకలాపాలకు రికార్డులు, ఫైళ్లు, నగదు బుక్‌ వంటివి నిర్వహించలేదని తెలిసింది. సామాజిక ఆడిట్‌లో ప్రతిపాదించిన మొత్తాన్ని కూడా రికవరీ చేయలేదు. 2019లో నిర్వహించిన 12వ సామాజిక తనిఖీలో రూ. 23,30,243 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీనిపైనా ఎటువంటి వివరణా ఇవ్వలేదు. రూ.75,75,993 మొత్తా నికి సోషల్‌ ఆడిట్‌ బృందానికీ రికార్డులు సమర్పించలేదు. నేమ్‌ బోర్డుల ఏర్పాటు విషయంలోనూ ఎటువంటి ఆధారాలూ చూపలేదని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement