ఊరూరా.. వైఎస్సార్‌సీపీకి జేజేలు | - | Sakshi
Sakshi News home page

ఊరూరా.. వైఎస్సార్‌సీపీకి జేజేలు

Mar 13 2026 7:46 AM | Updated on Mar 13 2026 7:46 AM

–8లో ఊరూరా.. వైఎస్సార్‌సీపీకి జేజేలు శుక్రవారం శ్రీ 13 శ్రీ మార్చి శ్రీ 2026

న్యూస్‌రీల్‌

పండగలా సాగిన వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం కేక్‌లు కట్‌చేసి పంచిపెట్టిన పార్టీ నేతలు

సామాజిక సేవల్లో నిమగ్నమైన కార్యకర్తలు

–8లో

సాక్షి, పార్వతీపురం మన్యం:

వైఎస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం పండగ వాతావరణంలో నిర్వహించారు. జిల్లాలోని నాలు గు నియోజకవర్గాల్లోనూ వేడుకలు అట్టహాసంగా సాగాయి. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేశారు. కేక్‌లు కట్‌చేసి పంచిపెట్టారు. దివంగత మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ లక్ష్యాలను వివరించారు. సామాజిక సేవాకార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.

●పార్వతీపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాల యం వద్ద మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, ఉమ్మడి జిల్లా పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ మరిశర్ల బాబూజీ, నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండా ఎగురవేశారు. కేక్‌ కట్‌చేసి అభిమానులకు పంచిపెట్టారు.

●పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్‌ విగ్రహానికి జోగారావు, నియోజకవర్గ పరిశీలకులు మావుడి శ్రీనివాసరావు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్‌ కోసి పంచిపెట్టారు. పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సీతానగరం, బ లిజిపేట మండలాల్లోనూ వేడుకలు నిర్వహించారు.

●పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి విశ్వాసరాయి కళావతి ఆధ్వ ర్యంలో వేడుకలు అట్టహాసంగా జరిగాయి. పాలకొండ, భామిని, సీతంపేట, వీరఘట్టం మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. జై వైఎస్సార్‌సీపీ అంటూ నినదించారు.

●కురుపాం నియోజకవర్గంలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కొమరా డ మండలాల్లో పార్టీ కన్వీనర్లు, ఇతర ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.

●సాలూరు నియోజకవర్గ కేంద్రంలో బోసు బొ మ్మ కూడలి వద్దనున్న వైఎస్సార్‌ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. పాచిపెంట, మక్కువ మండలాల్లోనూ వేడుకలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement