బండ గండం.. | - | Sakshi
Sakshi News home page

బండ గండం..

Mar 13 2026 7:46 AM | Updated on Mar 13 2026 7:46 AM

బండ గండం..

గ్యాస్‌ సిలిండర్ల కొరత ప్రచారంతో ముందస్తు బుకింగ్‌లు 80 శాతం వరకు పెరుగుదల బ్లాక్‌ చేస్తున్న ఏజెన్సీలు, వ్యాపారులు గ్యాస్‌ నిల్వలు, పంపిణీ తీరును పరిశీలించిన అధికారులు ఫిర్యాదుల కోసం కంట్రోల్‌రూం ఏర్పాటు

సమృద్ధిగా గ్యాస్‌ నిల్వలు

వీరఘట్టం మండలం వండువలో పండగ వాతావరణంలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ

దినోత్సవం

పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తున్న జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు

సాక్షి, పార్వతీపురం మన్యం:

వంట గ్యాస్‌ కొరత ప్రచారం ఓవైపు జోరుగా సాగుతుంటే.. మరోవైపు ఏజెన్సీలు, వ్యాపార వర్గా లు ముందుగానే సిలిండర్లను బ్లాక్‌ చేస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కసారిగా గ్యాస్‌ బుకింగ్‌ పెరగడంతో ఏజెన్సీలు సైతం సిలిండర్లు ఇవ్వడానికి వెనుకాడుతున్నాయి. దీంతో వినియో గదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని 15 గ్యాస్‌ ఏజెన్సీలను జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, పౌరసరఫరాల అధికారి అశోక్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్లు, తహసీల్దార్లు తనిఖీ చేశారు. గ్యాస్‌ నిల్వలు, పంపిణీ తీరును పరిశీలించారు.

పెరుగుతున్న ముందస్తు బుకింగ్‌లు

యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఎల్‌పీజీ గ్యాస్‌ కొరత ఏర్పడనుందన్న ప్రచారం నేప థ్యంలో వినియోగదారుల నుంచి ముందస్తు బుకింగ్‌లు పెరుగుతున్నాయి. జిల్లాలోని ఏజెన్సీల ద్వారా సుమారు 1.20 లక్షల మంది వినియోగదారులకు గ్యాస్‌ సరఫరా అవుతోందని అంచనా. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం గోదాముల్లో 9వేలకు పైగా సిలిండర్ల నిల్వలు ఉన్నాయి. విశాఖపట్న ంలోని బాట్లింగ్‌ ప్లాంట్ల నుంచి ప్రతిరోజూ జిల్లాకు గ్యాస్‌ సరఫరా అవుతోందని అధికారులు అంటున్నారు. రోజువారీ 3 వేల నుంచి 4 వేల వరకు బుకింగ్‌లు సజావుగా సాగుతున్నాయని, యుద్ధ వాతావరణంవల్ల కొరత ఉండవచ్చ న్న అపోహతో దాదాపు 80 శాతం మేర ఒక్కసారిగా పెరిగాయని చెబుతున్నారు.

ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా

కంట్రోల్‌రూం

గ్యాస్‌ సరఫరాలో ఇక్కట్లు, పెరిగిన బుకింగ్‌ల నేపథ్యంలో పంపిణీకి ఇబ్బంది ఎదురవుతోంది. కొంతమంది వ్యాపారులు సిలిండర్లను బ్లాక్‌ చేస్తున్నారన్న ప్రచారం జోరుగా ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. గ్యాస్‌ బ్లాక్‌ మార్కెటింగ్‌, అధిక ధరల వసూలు, బుకింగ్‌ చేసినా సరఫరా రాకపోవడం వంటి సమస్యలుంటే కంట్రోల్‌రూం ఫోన్‌ 70130 60665 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సంయుక్త కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

జిల్లాలో సమృద్ధిగా గ్యాస్‌ నిల్వలు ఉన్నాయి. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అపోహలకు గురి కావద్దు. అవసరం లేకపోయి నా, గ్యాస్‌ బుక్‌ చేసుకుని, కృత్రిమ కొరత సృష్టించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్ప టికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఎక్కడైనా ఇబ్బందులుంటే కంట్రోల్‌ రూం నంబరుకు ఫిర్యాదు చేయవచ్చు. 24 గంటల్లో సమస్య పరిష్కరిస్తాం.

– సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సంయుక్త కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement