● విచారణలో కాలయాపన.. చర్యలకు తాత్సారం ● ‘సీ్త్ర నిధి’లో పెద్ద ఎత్తున అక్రమాలు ● ‘వెలుగు’లో చీకటి కోణాలు
సాక్షి, పార్వతీపురం మన్యం:
‘వెలుగు’లో చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఫిర్యాదులు వెళ్తున్నా, ‘ఉన్నత’ స్థాయిలో అండదండలు.. తప్పించుకుని తిరగడానికి ఆస్కారమిస్తున్నాయి. జిల్లాలో దారిద్య్ర నిర్మూలన సంస్థ(సెర్ప్) అక్రమాల పుట్టగా మారిందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నా యి. అక్రమంగా నిధుల మళ్లింపు చేశార ని ఆధారాలతో సహా వెలుగులోకి వచ్చినా.. విచారణల పేరుతోనే కాలయాపన అవుతోంది. 2017 నుంచి 2024 కాలంలో చేపట్టిన వివిధ కార్యక్రమా లకు సంబంధించి నిధుల దుర్వినియోగం వ్యవహారంపై బాధ్యులను గుర్తించి, షోకాజ్ నోటీసులకే పరిమితం చేశారు. చర్యలకు మాత్రం వెనుకాడుతు న్నారు. సీ్త్రనిధి, సంకల్ప డిపాజిట్ల వ్యవహారంలో నిబంధనలకు తిలోదకాలిచ్చిన విషయంపై అనేక ఫిర్యాదులున్నాయి.
గుమ్మలక్ష్మీపురం మండల సమాఖ్య పరిధిలోని వెలుగు/సెర్ప్ ద్వారా అమలైన హెల్త్ అండ్ న్యూ ట్రిషన్ ప్రాజెక్టు సందర్భంగా పెద్ద స్థాయిలో ఆర్థిక అవినీతి చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టు ముగింపు సమయంలో మొత్తం 107 గ్రామ సంఘాల(వీవో) హెచ్‌ఎన్ ఖాతాలకు సంబంధించిన నిధులు ‘సంకల్ప’ పథకం కింద ఉన్న సీ్త్ర నిధి ఖాతాలో జమయ్యాయి. ఆ నిధులపై లభించిన వడ్డీని ప్రతినెలా సంబంధిత గ్రామ సంఘాల ఖాతాలకు జయ చే యాల్సి ఉంది. దశాబ్దకాలంగా వచ్చిన వడ్డీ మొత్తాలను అక్రమంగా మళ్లించినట్లు విచారణలో గుర్తించారు. సుమారు రూ.85 లక్షల నుంచి రూ.1.30 కోట్ల వరకు వడ్డీ మొత్తాలు దారి మళ్లించిన ట్లు సమాచారం. సీ్త్ర నిధి బ్యాంకుకు చెందిన ఇద్దరు ఏజీఎంలు కొన్నాళ్ల క్రితం విచారణ నిర్వహించి, తప్పు జరిగిన ట్లు నిర్ధారించారు. ఈ నేప థ్యంలో సీ్త్ర నిధి బ్యాంకు ఎండీ నుంచి సంబంధిత బ్యాంకు సిబ్బందికి మెమోలు కూడా వెళ్లాయి. అనంతరం మరో ఏజీఎం సుమారు నాలుగు నెలల కిందట బ్యాంక్ స్టేట్‌మెంట్లు పరిశీలించి రూ.70 లక్షల వరకు దారి మళ్లింద ని గుర్తించి, నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇప్పటి వరకు బాధ్యులపై ఎటువంటి చర్యలూ తీసుకోలేదు.
డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయంలో విచారణ పేరుతో కాలయాపన సాగుతోందన్న విమర్శలున్నాయి. ఇప్పటికే సుమారు ముగ్గురు ఏజీఎంలు నెలల తరబడి విచారణ చేశారు. బ్యాంకుల నుంచి పది సంవత్సరాల స్టేట్‌మెంట్లు కూడా తీశారు. రూ.57 లక్షల మేర అవినీతి జరిగిందని విచారణలో తేల్చారు. ఇద్దరు ఏపీఎంలు, ఆరుగురు సీసీలు, ఒక ఏజీఎం, ఒక డీపీఎం(ఫైనాన్స్), ఒక ఏపీడీ ఇందులో ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అక్రమాలకు పాల్పడిన వారికి మంత్రి పేషీ నుంచి అండదండలు పుష్కలంగా ఉన్నట్లు వినిపిస్తోంది. దీనివల్లే చర్యలకు వెనుకాడుతున్నారన్న గుసగుసలు సొంత శాఖ నుంచే వినిపిస్తున్నాయి.


