● జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత
విజయనగరం: జిల్లాలో ఈనెల 14న నిర్వహించనున్న జాతీయలోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత సూచించారు. జిల్లా కోర్టు సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా పోలీస్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీకాదగ్గ అన్ని క్రిమినల్, చెక్‌బౌన్స్ కేసులను గుర్తించి స్పెషల్‌డ్రైవ్ చేపట్టి వాటిని లోక్ అదాలత్‌లో పరిష్కరించాలని సూచించారు. దీనివల్ల కక్షిదారులకు డబ్బు, సమయం ఆదా అవుతుందన్నారు. సమావేశంలో న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణప్రసాద్, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 80 మంది పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


