పైడితల్లికి పుష్పాలంకరణ | - | Sakshi
Sakshi News home page

పైడితల్లికి పుష్పాలంకరణ

Mar 11 2026 7:24 AM | Updated on Mar 11 2026 7:24 AM

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీపైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూడులాంతర్ల జంక్షన్‌ వద్ద ఉన్న చదురుగుడి, రైల్వేస్టేషన్‌ దగ్గరున్న వనంగుడిలో కొలువైన అమ్మవారికి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఏడిద రమణ, తాళ్లపూడి ధనుంజయ్‌, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా పూజాధికాలు చేశారు. మహిళా భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement