శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
న్యూస్‌రీల్
టెండర్లు లేకుండా పనులు సర్దుకున్న కూటమి నేతలు రూ.10 కోట్ల విలువైన పనుల పంపకాలు దీనిపై ప్రశ్నించిన ఎంపీపీ పనులు ప్రారంభించకపోవడంపై పీడీ మండిపాటు
రెండేళ్లుగా...
మండలిలో ప్రశ్నించాం...
పలుమార్లు ఫిర్యాదు చేశాం..
ఆన్‌లైన్‌లో తప్పుడు
సమాచారం
● యువతకు పారిశ్రామిక నైపుణ్య శిక్షణ
● ఐటీడీఏ పీఓ యశ్వంత్‌కుమార్ రెడ్డి
వీరఘట్టం: హాజరు తక్కువగా ఉన్న ఇంట ర్ విద్యార్థులు కాండినేషన్ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి వై.నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. ఈ నెల 23 నుంచి మార్చి 18వ తేదీ వరకు జిల్లాలోని 33 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నా రు. ఈ ఏడాది మొత్తం 17,530 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపా రు. వీరిలో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 5,938 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,849 మంది, సెకెండియర్‌లో జనరల్ విద్యార్థులు 6,127 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,616 మంది ఉన్నట్లు తెలిపారు.
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానాన్ని మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం సందర్శించారు. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రితో కలిసి ఆయన పర్యటించారు. ముందుగా దిగువనున్న ప్రధాన ఆలయాన్ని సందర్శించి.. ఆలయ అధికారులు, అర్చకులతో సమావేశమయ్యారు. అనంతరం నీలాచల పర్వతంపై ఉన్న శ్రీ కోదండ రామస్వామివారి ఆలయాన్ని సందర్శించారు. గతంలో బోడికొండపై చోటు చేసుకున్న కోదండ రాముడి విగ్రహ ధ్వంసం ఘటన అనంతరం ప్రతిష్టించిన నూతన విగ్రహాల నిర్వహణ, ఆలయంలో ఉన్న పాత విగ్రహాల గురించి ఆరాతీసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. పాత విగ్రహాలు ఇంత కాలం ఎందుకు ఆలయంలో ఉంచారని శాస్త్రి ప్రశ్నించగా.. దర్యాప్తు కారణంగా ఉంచాల్సి వచ్చిందని ఆలయ అధికారులు, అర్చకులు సమాధానం ఇచ్చారు.
పర్యటన ఉద్దేశమేమిటో?
రామతీర్థంలో మాజీ సీఎస్ సుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి పర్యటన ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆలయాన్ని సందర్శిస్తున్నట్లు మీడియాకు ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. స్థానిక ప్రసాద నివేదన తయారీ మండపంలో సుమారు అర్ధ గంటపాటు ఆలయ అధికారులు, అర్చకులతో చర్చించారు. అశోక్ బంగ్లాకు శుక్రవారం రావా లని వారికి సూచించినట్లు తెలిసింది. వారి వెంట ఈఓ శ్రీనివాసరావు, అర్చకులు సాయిరామాచార్యులు, మల్లిఖార్జునశర్మ ఉన్నారు.
నేడు బీఎడ్ కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మహి ళా ఇన్‌సర్వీస్ టీచర్లకు 2026–27 విద్యా సంవత్సరానికి బీఎడ్ దూర విద్య ప్రవేశాలకు శుక్రవా రం కౌన్సెలింగ్ నిర్వహించనుంది. విజయనగ రం పట్టణ శివారున ఉన్న కరకవలసలోని డాక్టర్ పీవీజీ రాజాసాహెబ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీ సెంటర్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆ సెంటర్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.శ్రీనివాసమోహన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌సర్వీస్ టీచర్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని మెరిట్ లిస్ట్ ఆధారంగా ఈ–మెయిల్ ద్వారా సమాచారం అందుకున్న అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల పరిధిలోని అభ్యర్థులు స్టడీ సెంటర్‌లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు.
సాక్షి, పార్వతీపురం మన్యం/పాలకొండ రూరల్:
అర్హులందరికీ తల్లికి వందనం పథకం అందిస్తున్నామని.. ఎంత మంది పిల్లలుంటే అందరికీ జమ చేస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి మోసం చేసింది. ఏపీ గవర్నర్‌తోనూ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల ప్రారంభ ప్రసంగంలో అవే అబద్ధాలు చెప్పించింది. 15 శాతం మందికి అందలేదని నిరూపిస్తే.. ఏ శిక్షకై నా సిద్ధమని ఓ మంత్రి సెలవిచ్చారు. రాష్ట్రం మొత్తం సంగతి అలా ఉంచితే.. జిల్లాలోనే వేలాది మంది పథకానికి దూరమైన పరిస్థితి ఉంది.
పథకం.. ప్రహసనం
చంద్రబాబు ప్రభుత్వంలో తల్లికి వందనం పథకం పొందడం లబ్ధిదారులకు ప్రహసనంగా మారింది. ఇంట్లో ఎందరు చదువుకున్న పిల్లలు ఉన్నా, అందరికీ వర్తింపజేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఒక్క మన్యం జిల్లాలోనే వేలాది మందికి పథకం లబ్ధిని దూరం చేసింది. వేరొకరి కరెంటు బిల్లులు ఆధార్‌తో లింకు కావడం, భూమి లేకున్నా ఉన్నట్లు చూపడం.. ఇలాంటి సమస్యలే కాక, తల్లుల పేర్లు కూడా మారిపోవడం గమనార్హం. సీతానగరం, పార్వతీపురం, పాలకొండ, కొమరాడ, కురుపాం.. ఇలా అనేక మండలాల్లో తల్లి స్థానంలో ‘కిల్లో స్వప్న’ పేరు నమోదైంది. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో.. ఇంక ఓపిక లేక, చాలా మంది ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. గత విద్యాసంవత్సరం ప్రారంభంలో తల్లికి వందనం పథకం నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే.. అన్ని అర్హతలూ ఉండి, అధికారుల తప్పిదాల వల్ల పథకానికి దూరమైన తల్లులు నెలల తరబడి అధికారుల చుట్టూ తిరిగారు. పాఠశాలకు వెళ్తే.. సచివాలయానికి వెళ్లాలని.. అక్కడికి వెళ్తే ఎంఈవో కార్యాలయంలో అడగాలని.. వారేమో డీఈవో కార్యాలయంలో కలవాలని.. ఇక్కడేమో.. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం ఇవ్వాలని.. ఇక్కడికి వచ్చేసరికి మళ్లీ పాఠశాలకో, సచివాలయానికో పోవాలని.. ఇలా ఏ ఒక్కరికీ సంబంధం లేనట్లు తప్పించుకుని తిప్పారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం చివరికి వచ్చేసింది. ఇప్పుడు డబ్బులు జమవుతాయన్న ఆశ లేదు. వచ్చే విద్యాసంవత్సరంలోనైనా పొరపాటు సరిదిద్దాలని కోరుతున్నారు. జిల్లాలో మొదటి విడతగా 1,08,951 మంది విద్యార్థులు పథకానికి అర్హత సాధించినట్లు అధికారులు ప్రకటించారు. అర్హతలు ఉండి పథకం పొందని విద్యార్థులు ఇంకా వేల మంది మిగిలిపోయారు. కొందరికి ‘ఎలిజిబుల్’ అని జాబితాలో చూపించినా, డబ్బులు పడలేదు. మలి విడతలో నగదు జమ అవుతుందని అధికారులు చెప్పి పంపించేశారు. ఇచ్చిన మొత్తంలోనూ చాలా మందికి రూ.7 వేల నుంచి రూ.10 వేలలోపు జమ కావడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.
అధికారులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి
పార్వతీపురం రూరల్: గిరిజన నిరుద్యోగ యువత కు ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను పారదర్శకంగా, నాణ్యతతో నిర్వహించాలని ఐటీడీఏ ఇన్‌చార్జ్ ప్రాజెక్టు అధికారి సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి శిక్షణ సంస్థలను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో శిక్షణ పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. శిక్షణ కేవలం థియరీకే పరిమితం కాకుండా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌తో ఉండాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు కనీస సౌకర్యాల కల్పనలో రాజీ పడకూడదని, ప్రతి ఒక్కరికీ స్థిరమైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. శిక్షణ కేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తామని, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఐటీడీఏ ఏపీఓ మురళీధర్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సాయికృష్ణ చైతన్య, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
నా భార్య పేరు బదులుగా స్వప్న అనే పేరు ఆన్‌లైన్‌లో చూపించింది. ఆమె పేరున ఉన్న ఆస్తులను చూపించి మాకు లబ్ధి లేకుండా చేశారు. ఈ సమస్యపై ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి. పాఠశా ల యాజమాన్యాలు, స్థానిక అధికారులు ఏమీ చెప్పలేకపోతున్నారు. తొలి ఏడాదిలో పథకం అమ లు కాలేదు. రెండో ఏడాదిలో సాంకేతిక సమస్యల తో లబ్ధి పొందలేకపోయాం.
– బి.లక్ష్మునాయుడు, విద్యార్థిని తండ్రి,
పాలకొండ మండలం
తల్లికి వందనం పథకంపై నేటికీ ఒక స్పష్టత లేదు. గతంలో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగలేదు. ఇందుకు నిదర్శనం బాధితులెవరూ ఫిర్యాదు చేయకపోవడమే. చంద్రబాబు సర్కారు రెండేళ్ల పాలనా కాలంలో ఒకేడాది పూర్తిగా పథకం అమలు చేయలేదు. రెండవ ఏడాది శతశాతం అర్హులకు లబ్ధి చేకూర్చలేదు. కొన్ని చోట్ల ఏడు, ఎనిమి వేల వరకు మాత్రమే అందించారు. ఎంత మంది పిల్లలు ఉంటే, అంత మందికీ లబ్ధి చేకూరలేదు. ప్రతీ పాఠశాలలోనూ అర్హత ఉండి, లబ్ధి పొందని విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వమే నేరుగా పరిశీలన చేస్తే నిగ్గు తేలుతుంది.
– పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ
తల్లికి వందనం కోసం అర్హత ఉన్నా లబ్ధి పొందలేకపోయాం. పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేశాం. తొలి రోజుల్లో కిల్లో స్వప్న పేరు మా పిల్లలకు తల్లిగా వచ్చింది. ఈ నెపంతో లబ్ధిని దూరం చేశారు. ఏడాది గడుస్తు న్నా ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టతా లేదు.
– గేదెల ఉష, గృహిణి, పాలకొండ
మా పిల్లలకు తల్లికి వంద నం నగదు జమ కాలేదు. ఆన్‌లైన్‌లో ఇతరుల పేర్లు సంరక్షకులుగా నమోద య్యాయి. కార్మిక కుటుంబం మాది. ఆన్‌లైన్‌లో నమోదైన పేర్లపై ఉన్న ఆస్తులను చూపించి మాకు లబ్ధి చేకూరలేదు. అధికారులెవరూ సమాధానం కూడా చెప్పడం లేదు. పిల్లల చదువులకు అయ్యే ఖర్చులు భారంగా మారాయి.
– మీసాల వనజాక్షి, పాలకొండ పట్టణం
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
శుక్రవారం శ్రీ 20 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026


