22న పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

22న పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు

Feb 19 2026 10:04 AM | Updated on Feb 19 2026 10:04 AM

22న పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు

22న పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు

22న పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు

విజయనగరం: రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో జరుగనున్న పారా బ్యాడ్మింటన్‌ క్రీడా పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈ నెల 22న నిర్వహింంచనున్నట్టు పారా జిల్లా అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్‌ తెలిపారు. ఈ మేరకు జిల్లా స్థాయి పోటీల నిర్వహణకు సంబంధించిన కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఓపెన్‌ కేటగిరిలో నిర్వహించే ఎంపికల్లో ఆసక్తి గల దివ్యాంగ క్రీడాకారులు ముందుగా పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు ఆ రోజు రాజీవ్‌ ఇండోర్‌ స్టేడియంలో 8 గంటల నుంచి ఎంపికలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. ఇతర వివరాలకు 9849377577 నంబరును సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో కె.ప్రసాద్‌, రోహిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement