హోటళ్లపై పౌర సరఫరాల అధికారుల దాడులు | - | Sakshi
Sakshi News home page

హోటళ్లపై పౌర సరఫరాల అధికారుల దాడులు

Feb 19 2026 10:04 AM | Updated on Feb 19 2026 10:04 AM

హోటళ్లపై పౌర సరఫరాల అధికారుల దాడులు

హోటళ్లపై పౌర సరఫరాల అధికారుల దాడులు

హోటళ్లపై పౌర సరఫరాల అధికారుల దాడులు

19 గృహ వినియోగ సిలిండర్లు స్వాధీనం

● 6ఏ కేసులు నమోదు : డీఎస్‌ఓ మురళీనాధ్‌

విజయనగరం కలెక్టరేట్‌: జిల్లా పౌర సరఫరాల అధికారి జి.మురళీనాధ్‌ ఆదేశాల మేరకు విజయనగరం పట్టణంలో పలు హోటళ్లు, డాబాలు, టిఫిన్‌ సెంటర్లు, రెస్టారెంట్లపై ఆ శాఖ అధికారులు బుధవారం దాడులు చేశారు. గ్యాస్‌ సిలిండర్లను తనిఖీ చేసి, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 19 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడు చోట్ల సివిల్‌ సప్లయిస్‌ డీటీలు తనిఖీలు నిర్వహించి, 6ఏ కేసులను నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్‌ఓ మురళీనాధ్‌ మాట్లాడుతూ డొమెస్టిక్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కమర్షియల్‌ సిలిండర్లను మాత్రమే వాణిజ్య అవసరాలకు వినియోగించాలని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement