ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

Dec 2 2025 9:16 AM | Updated on Dec 2 2025 9:16 AM

ముందస

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి ఇది అనధికార లే అవుట్‌

పార్వతీపురం: విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తు జాగ్రత్తలు అవసరమని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి అన్నా రు. కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణంలో ఏపీ విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ జిల్లా కు సరఫరా చేసిన రక్షణ పరికరాలను కలెక్టర్‌ సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విపత్తులశాఖ సామర్థ్యా న్ని మరింత పెంపొందించుకోవాలన్నారు. రక్ష ణ పరికరాలతో జిల్లాలోని ప్రజలకు సమయానుకూలంగా, త్వరితగతిన, నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో విపత్తుల నిర్వాహణాధికారి పి.సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు.

మెట్టపల్లిలో వైద్య శిబిరం

వైద్య శిబిరాన్ని సందర్శించిన

డీఎంహెచ్‌ఓ

చీపురుపల్లి: స్క్రబ్‌ టైఫస్‌ వైరస్‌ కలకలం నేపథ్యంలో చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామంలో సోమవారం వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. స్క్రబ్‌ టైఫస్‌ వైరస్‌ లక్షణాలతో భార్య మృతి చెందినట్టు భర్త తెలిపిన వివరాల మేరకు గతనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు వైద్య సిబ్బంది స్పందించారు. కర్లాం పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీలక్ష్మి, సిబ్బంది వైద్యశిబిరం నిర్వహించారు. గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. డీఎంహెచ్‌ఓ జీవనరాణి వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యాధికారితో మాట్లాడి వివరా లు తెలుసుకున్నారు. మృతురాలు చికిత్స పొందిన ఆస్పత్రి వివరాలపై ఆరా తీశారు. ప్రస్తు తం మెట్టపల్లిలో ఎలాంటి స్క్రబ్‌ టైఫస్‌ వైరస్‌ వ్యాప్తి చెందలేదని పీహెచ్‌సీ వైద్యాధికారి శ్రీలక్ష్మి తెలిపారు. డీఎంహెచ్‌ఓ వెంట జిల్లా ఇమ్యూనిటీ అధికారి సత్తిరాజు, జిల్లా సర్వేలైన్స్‌ అధికారి సత్యనారాయణ ఉన్నారు.

చీపురుపల్లి: ‘ఇది అనధికార లే అవుట్‌.. ఈ లే అవుట్‌కు ఎలాంటి అనుమతులు లేవు.. క్రయ విక్రయాలకు గ్రామ పంచాయతీ ఎలాంటి బాధ్యత వహించదు.. ఇక్కడ ప్లాట్లు కొన్న వారికి ఇంటి ప్లాన్లు ఆమోదించబడవు.. తాగునీటి సదుపాయం అనుమతించబడదు’.. ఇదీ రావివలస రెవెన్యూ పరిధిలో వెలసిన అనధికార రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు. రావివలస రెవెన్యూ పరిధిలో ఏర్పాటైన అనధికార లే అవుట్‌పై ‘దర్జాగా రియల్‌ దందా’ అనే శీర్షికన గతనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదేరోజు ఎంపీడీఓ సురేష్‌ ఆధ్వర్యంలో సిబ్బంది రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ను పరిశీలించి నోటీసులు జారీచేశారు. పంచాయతీ కార్యదర్శి కె.సతీష్‌, వీఆర్వో ఏ.జగన్నాథం నేతృత్వంలో అనధికార లే అవుట్‌లో సోమవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నంబర్‌ 164/11,12,13,14,15, 165/1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 166/1, 2, 3పి, 4పి నంబర్లల్లో ఏర్పాటు చేసిన లే అవుట్‌కు ఎలాంటి అనుమతులు లేవని హెచ్చరిక బోర్డులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

● హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు

● ఇంటి ప్లాన్లు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం మంజూరు చేయం

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి 1
1/2

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి 2
2/2

ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement