స్కానింగ్‌ సెంటర్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో | - | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌ సెంటర్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

Nov 22 2025 6:56 AM | Updated on Nov 22 2025 6:56 AM

స్కానింగ్‌ సెంటర్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

స్కానింగ్‌ సెంటర్‌ను తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

విజయనగరం ఫోర్ట్‌: పట్టణంలోని అల్ఫా స్కానింగ్‌ సెంటర్‌ను, సాయి పీవీఆర్‌ ఆస్పత్రిని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి శుక్రవారం తనిఖీ చేశారు. స్కానింగ్‌ సెంటర్‌లో జరుగుతున్న విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు, రిజిస్టర్‌లు తనిఖీ చేశారు. స్కాన్‌ సెంటర్‌ యొక్క ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో ఉన్న రిపోర్టులను టారిఫ్‌ బోర్డులను తనిఖీ చేశారు. ఽటారిఫ్‌ బోర్డులు ప్రదర్శించకుండా క్లినిక్‌, డయోగ్నోస్టిక్‌, ఆస్పత్రిగా నిర్వహించకుంటే తగు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డెమో వి.చిన్నతల్లి, డిప్యూటీ హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ ఎం.చాముండేశ్వరి, మానిటరింగ్‌ కన్సల్టెంట్‌ ఎ.పవన్‌ అశిష్‌ పాల్గొన్నారు.

పిచ్చి కుక్క దాడిలో

పది మందికి గాయాలు

కురుపాం: మండల కేంద్రంలోని పలు వీధుల్లో శుక్రవారం సాయంత్రం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. బస్టాండ్‌, ప్యాలెస్‌ వీధి, శోభలతాదేవి కాలనీ, గౌడు వీధి, గాంధీ నగర్‌ కాలనీల్లో సుమారు పది మంది వరకు స్థానికులకు పిచ్చి కుక్క కాటు వేయటంతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement