
పరిమళించిన మానవత్వం
రాజాం సిటీ: మానవతా సంస్థ సభ్యుల్లో మానవత్వం పరిమళించింది. రోడ్డు పక్కన గాయాలతో బాధపడుతున్న అనాథ మహిళకు వైద్యసేవలు అందించి మానవత్వం చాటుకున్నారు. స్థానిక బొబ్బిలి రోడ్డులోని ఆర్‌సీఎం చర్చి సమీపంలో అనాథ మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఓ మూలన ఉన్న మహిళను స్థానికులు గుర్తించి మానవతా సంస్థ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే సభ్యులు ఉల్లాకుల నీలకంఠేశ్వరయాదవ్, రెడ్‌క్రాస్ ప్రతినిధి పెంకి చైతన్య, కిరణ్‌లు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత అనాథ మహిళను ప్రత్యేక వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందించారు. అయితే ఆమె తీవ్రంగా గాయపడడంతో శస్త్రచికిత్స పడుతుందని, అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని వైద్యులు తెలిపారని మానవతా సంస్థ సభ్యులు తెలిపారు. దీంతో పలువురు పట్టణవాసులు వారి సేవలను కొనియాడారు.