
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ105 శ్రీ180 శ్రీ190
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు చేశారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్‌లు శాస్త్రోక్తంగా పూజాదికాలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని పసుపు, కుంకుమలు చెల్లించారు. ఆలయం వెనుక వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు పర్యవేక్షించారు.
జాతీయ లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోండి
విజయనగరం లీగల్: ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో మోటారు ప్రమాద బీమా కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన అధికారులు మోటారు ప్రమాద బీమా కంపెనీల అధికారులు లోక్ అదాలత్‌లో పాల్గొని పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవ అఽధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎంపీడీఓలు కీలకంగా వ్యవహరించాలి
● జెడ్పీ సీఈఓ సత్యనారాయణ
పార్వతీపురం రూరల్: ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఎంపీడీఓలు కీలకంగా వ్యవహరించాలని జెడ్పీ సీఈఓ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మండలంలోని పెదబొండపల్లి గ్రామంలో ఎస్‌డబ్ల్యూపీసీ(చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం) లో ఒకరోజు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలతో పాటు ఇన్‌చార్జ్ ఎంపీడీఓలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాల కార్యాచరణ ప్రతి పంచాయతీలో కచ్చితంగా అమలు కావాలన్నారు. నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, ఈ మేరకు నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఎస్‌డబ్ల్యూపీసీ ఆవశ్యకతను వివరించాలని కోరారు. ఈ శిక్షణలో డీపీఓ కొండలరావుతో పాటు డీఎల్‌పీఓ తదితరులు పాల్గొన్నారు.
నలుగురికి తీవ్ర గాయాలు
పార్వతీపురం రూరల్: పట్టణ ప్రారంభంలో అంతర్‌రాష్ట్ర రహదారిపై స్వీట్ దుకాణం సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికుల సాయంతో హుటాహుటిన జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. గాయాలైన వారిలో అనిల్, శిల్లా రవికుమార్, కె. శంకరరావు, డి.రాంబాబు ఉన్నారు.

చికెన్

చికెన్

చికెన్