
శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంచాలి
విజయనగరం అర్బన్: విజ్ఞాన శాస్త్రం పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచాలని ఆ దిశగా వారిలోని ఆలోచనలతో కూడిన ప్రాజెక్టుల రూపకల్పనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ యు.మాణిక్యం నాయుడు అన్నారు. విద్యార్థుల్లో శాస్త్రచైతన్యాన్ని పెంపొందించడం, సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం లక్ష్యంగా ‘ఇన్‌స్పైర్–మనక్’ కార్యక్రమం నిర్వహణలో భాగంగా సైన్స్ ఉపాధ్యాయుల కోసం స్థానిక పీఎస్‌ఆర్‌ఈఎం స్కూల్‌లో మంగళవారం చేపట్టిన ఒక రోజు ఓరియంటేషన్ తరగతిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఉన్నత పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు, ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు ప్రాజెక్టులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. డీసీఈబీ సెక్రటరీ టి.సన్యాసిరాజు మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక, పరిసరాలకు అనుగుణంగా సైన్స్ ప్రాజెక్టులను విద్యార్థులు రూపకల్పన చేయాలని సూచించారు. అనంతరం ఇన్‌స్పైర్ పోస్టర్, ఏపీఓఎస్‌ఎస్ ఓపెన్ స్కూల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. రిసోర్స్ పర్సన్‌లుగా ఎ.భానుప్రకాష్, అరసాడ సురేంద్రనాథ్, ఎస్.ఉమామహేశ్వరరావు, ఎన్‌జీసీ కోఆర్డినేటర్ బూరి వేణుగోపాల్‌రావు వ్యవహరించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ కేవీరమణ, జిల్లా సైన్స్ అధికారి టి.రాజేష్, జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ జి.సన్యాసినాయుడు, డివిజన్ పరిధిలోని సైన్స్ టీచర్లు పాల్గొన్నారు.
డీఈఓ యూ.మాణిక్యంనాయుడు