
19న పీ4 కార్యక్రమం
పార్వతీపురం రూరల్: ఈనెల 19న పీ4 కార్యక్రమం ప్రారంభానికి సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పాల్గొన్నారు. ఈ మేరకు స్వచ్ఛందంగా మార్గదర్శులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో కలెక్టర్, అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలపై సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. 2029 నాటికి బంగారు కుటుంబాలను పీ4 కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసి ఆర్థిక అసమానతలను తొలగించేలా తొలి అడుగు వేయబోతున్నామని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 2047 నాటికి ఆర్థిక సమానత్వం సాధించాలని సీఎం పేర్కొన్నట్లు స్పష్టం చేశారు. ఈ సమీక్షలో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్‌ఎస్ శోభిక, పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, ఉప కలెక్టర్లు పి.ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, డ్వామా పీడీ కె. రామచంద్రరావు, జిల్లా ప్రణాళిక అధికారి ఆర్‌కె పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్