45 సవర్ల బంగారం, నగదు చోరీ | - | Sakshi
Sakshi News home page

45 సవర్ల బంగారం, నగదు చోరీ

Aug 2 2026 1:46 AM | Updated on Aug 2 2026 1:46 AM

45 సవర్ల బంగారం, నగదు చోరీ

నరసరావుపేట టౌన్‌: ఇంటికి వేసిన తాళం వేసినట్లుగానే ఉన్నా.. లోపలి రూ.70 లక్షల బంగారు ఆభరణాలు, రూ.20.50 లక్షల నగదు చోరీ అయ్యాయి. వన్‌టౌన్‌ సీఐ షేక్‌ ఫిరోజ్‌ కథనం ప్రకారం... రొంపిచర్ల మండలం ఆరేపల్లి ముప్పాళ్లకు చెందిన జక్కిరెడ్డి ఆదినారాయణరెడ్డి, కోటేశ్వరమ్మ దంపతులు ప్రకాష్‌నగర్‌ బాలాజీ ఆర్కెడ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో ఇనుప పెట్టెలో సుమారు 45 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.20.50 లక్షల నగదు గురువారం భద్రపరిచి తాళం వేశారు. తాళం చెవిని డైనింగ్‌ హాల్‌ పక్కనే ఉన్న బీరువాపై ఉంచారు. శనివారం ఇనుప పెట్టె తెరిచి చూడగా ఆభరణాలు, నగదు కనిపించలేదు. వన్‌టౌన్‌ సీఐ ఫిరోజ్‌, ఎస్‌ఐ అరుణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించి పలు అనుమానాలను వ్యక్తం చేశారు. ఇనుప పెట్టె తాళం తెరిచి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. క్లూస్‌ టీం ఆధారాలను సేకరించింది. అపార్ట్‌మెంట్‌లో సీసీ ఫుటేజ్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement