పులిచింతలు తప్పవా? | - | Sakshi
Sakshi News home page

పులిచింతలు తప్పవా?

Jul 30 2026 4:48 AM | Updated on Jul 30 2026 4:48 AM

పులిచింతలు తప్పవా?

గత ఏడాది ఈ రోజుల్లో ప్రాజెక్టు

ప్రస్తుతం ఉన్నది 28 టీఎంసీలే..

ఎల్‌నినో ప్రభావం ప్రాజెక్టుపై చూపే అవకాశం

ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరితే పరిస్థితేంటో..?

ముంచుకొస్తున్న ఎల్‌నినో ప్రభావం

ఏడాది ఎల్‌నివో ప్రభావం వల్ల వర్షాలు తగ్గి తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌లో కృష్ణా డెల్టా ప్రాంతాలలో వర్షం పడితే పులిచింతల ప్రాజెక్టు నుంచి ఆయకట్టు భూములకు రోజుకు 10వేల క్యూసెక్కులు వదలాల్సి ఉంటుంది. వర్షాలు లేకపోతే ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న 28 టీఎంసీలు నిల్వలు క్రమంగా తగ్గి రెండు నెలల్లోనే డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశాలున్నాయి.

అదే జరిగితే ప్రస్తుతం రెండు పంటలు పండించుకుంటున్న కృష్ణా, డైల్టా ప్రాంతాలకు చెందిన 13 లక్షల ఎకరాల ఆయకట్టు భూముల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తలుచుకుంటేనే అన్నదాత వెన్నులో వణుకు పుడుతోంది. మళ్లీ 2019 ముందు పరిస్థితులు పునరావృతమవుతాయన్న భయంతో వణికిపోతున్నారు.

ఇప్పటికే ఎగువ శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులలో కూడా నీటి నిల్వలు గణనీయంగా తగ్గాయి. భారీ వర్షాలకు అవకాశం కనిపించడంలేదు. 2019 ఖరీఫ్‌ సీజన్‌ అంటే జూన్‌ నుంచే భారీ వర్షాలు కురవడం, ఎగువ నాగార్జునసాగర్‌ నుంచి వరద నీరు రావడంతో 2019 –24 మార్చి వరకు ఏటా ప్రాజెక్టులో 45 టీఎంసీల నిల్వ ఉంచుతూ వచ్చారు. వేసవిలో వర్షాలు లేకపోయినా సాగు, తాగు నీటి కోసం నీటిని వదలడంతో నిల్వ కొంత తగ్గినా తిరిగి కురిసిన వర్షాలకు ప్రతి ఏటా ప్రాజెక్టు నిండుతూనే ఉండేది.

అచ్చంపేట: అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28 టీంసీలకు చేరింది. ప్రాజెక్టుకు దిగువకు తెలంగాణ వైపు ఉన్న జల విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్‌కు రోజుకు 400 నుంచి 1000 క్యూసెక్కులు వదులుతున్నారు. జులై మాసం ముగుస్తున్నా సరైన వర్షాలు లేకపోవడంతో ఎగువన శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులు నిండి, మిగులు నీరు వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. గతంలో పులిచింతల ప్రాజెక్టుకు దిగువ కృష్ణా, డెల్టా ప్రాంతాలలో ఉన్న 13 లక్షల హెక్టార్ల ఆయకట్టు భూములకు ప్రాజెక్టు నుంచే సమృద్ధికి సాగునీరు అందేది. ఆయా ప్రాంతాల రైతులు ఏడాదిలో రెండు పంటలు పండించుకున్నారు. కాని ఈ ఏడాది పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి ఏటా జులై, ఆగస్ట్‌, సెప్టెంబర్‌ మాసాలలో వర్షాలు పుష్కలంగా కురవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గేవి కావు. సాగునీటి కోసం రోజుకు 10,000 క్యూసెక్కులకు పైగా వదిలినప్పటికి ప్రాజెక్టులో 43 నుంచి 45 టీఎంసీల నిల్వ ఉండేది. ఈ ఏడాది ఇంత వరకు ఆయకట్టు భూములకు చుక్క నీటిని వదలలేదు.

వరి పంట వేయకపోతే అన్నదాతలకు కష్టాలే...

కృష్ణా, డెల్టా ప్రాంతాల రైతులు ఈ ఏడాది వరి వేయవద్దని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటించడంపై రైతులలో ఆందోళన తీవ్ర తరమైంది. ఒక వైపు ఎల్‌నినో ప్రభావం ముంచుకొస్తుంది. తీవ్ర సంక్షోభం ఏర్పడబోతుందని ముందే చెబుతున్న సీఎం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో శ్రద్ధ చూపించలేక పోతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారు చెప్పిన ప్రకారం వరి పంట వేయకపోతే రైతుల పరిస్థితి ఏంటో అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటికి బియ్యం క్వింటా రూ.6వేలకు చేరింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచి నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. నిత్యావసర దినుసులు ఏవి కొనాలన్నా కిలో రూ.150 పైనా ఉన్నాయి. వీటికి తోడు బియ్యం ధరకూడా పెరిగితే అన్ని వర్గాలవారికి ఇబ్బందులు తప్పేటట్లు లేవు.

నిల్వ డెడ్‌ స్టోరేజీకి చేరితే...

ప్రాజెక్టు డెడ్‌ స్టోరేజీకి చేరితే భూగర్భ జలాలు అడుగంటుతాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న అచ్చంపేట, బెల్లంకొండ మండలాలలో భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయితే 500 అడుగులలో బోరు వేసినా చుక్కనీరు పడే అవకాశాలుండవు. దీనివల్ల కృష్ణా డెల్టా ప్రాంత రైతాంగానికే కాకుండా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని భూములకు సాగునీటి కష్టాలు తప్పవు. కృష్ణానదిలో నీటిలెవెల్స్‌ తగ్గిపోతే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములు, రక్షిత మంచి నీటి పథకాలు పనిచేయవు. కరవు విలయతాండవం చేయక మునుపే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని రైతాంగం కోరుతోంది.

పులిచింతల ప్రాజెక్టులో

తగ్గిన నీటి నిల్వ

నీటి నిల్వ 43 టీఎంసీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement