జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ మనాక్‌లో ప్రదర్శించిన ప్రాజెక్టుల్లో 10 శాతం రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్ నుంచి 10 శాతం జాతీయ స్థాయికి ప్రాజెక్టులు వెళతాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను సైన్‌న్స్ ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తూ ప్రాజెక్టుల నమోదులో కీలకంగా ఉండాలి. అన్ని పాఠశాలల నుంచి ప్రాజెక్ట్‌లు వెళ్లేలా సైన్‌న్స్ ఉపాధ్యాయు లు కృషి చేయాలి. ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలి.
– పీవీజే రామారావు, జిల్లా విద్యాశాఖ అధికారి, పల్నాడు


