నరసరావుపేట రూరల్: ౖరెల్వేలో ఉద్యోగం, సీఆర్‌డీఏలో రికార్డు అసిస్టెంట్ కొలువు, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసినట్టు పలువురు బాధితులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 90 ఫిర్యాదులు అందాయి. జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు.
డ్వాక్రా గ్రూప్ లీడర్ మోసం
– సభ్యుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంక్‌కు చెల్లించకుండా డ్వాక్రా గ్రూపు లీడర్ మోసం చేసినట్టు వినుకొండకు చెందిన మహిళలు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని గ్రూప్ లీడర్ రుబీనా చెల్లించకుండా రూ.13 లక్షలు మోసానికి పాల్పడినట్టు వివరించారు. ఐదుగురి సభ్యుల పోర్జరీ సంతకాలతో పొదుపు డబ్బులు కూడా డ్రా చే సినట్టు తెలిపారు. తమకు న్యాయం చేయాలని అదనపు ఎస్పీని కోరారు.
రేపల్లె: పట్టణ శివారులోని ఓ హోటల్‌లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ పి.శ్రీనివాస్ వివరాల మేరకు పెనుమూడి రోడ్డులోని దేవగిరి రమేష్‌బాబుకు చెందిన పల్లె రుచులు హోటల్‌లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. హోటల్‌లోని తాటాకు పందిళ్లకు మంటలు వ్యాప్తి చెందాయి. నిర్వాహకుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని పేర్కొన్నారు.


