మట్టి మాఫియా దోపిడీ | - | Sakshi
Sakshi News home page

మట్టి మాఫియా దోపిడీ

Jul 23 2026 2:24 AM | Updated on Jul 23 2026 2:24 AM

గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026 మట్టి మాఫియా దోపిడీ నిత్యం వందల వాహనాల్లో...

న్యూస్‌రీల్‌

సాగర్‌ నీటిమట్టం

పల్నాడు
గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026

సాక్షి, నరసరావుపేట: మంగళవారం అర్థరాత్రి నిద్రిస్తున్న డ్రైవర్‌ నాగరాజుపై టిప్పర్‌ వెళ్లడంతో మరణించిన ఘటన నేపథ్యంలో మట్టి మాఫియాపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాత్రివేళల్లో భారీ పొక్లెయినర్‌లతో చెరువులు, కొండల్లోని మట్టిని తవ్వి భారీ టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈపూరు మండలం ముప్పాళ్ల వైపు, మండలంలోని సమీప గ్రామాలకు, నరసరావుపేట పట్టణానికి సైతం మట్టిని తరలిస్తున్నా ఏ అధికారి కంటపడకపోవడం శోచనీయం. మట్టిని కొల్లగొడుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం దారుణమని స్థానికులు వాపోతున్నారు. ప్రధానంగా అద్దంకి– నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారి, చీరాల ఓడరేవు– నకరికల్లు రహదారి, గ్రామాల్లోని ప్రధాన రహదారుల గుండా మట్టి తరలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని భయపెట్టి, బుజ్జగించి అక్రమార్కులు మైనింగ్‌ వ్యవహారం సాగిస్తున్నారు.

ఇప్పటికే వందలాది లారీల చెరువు మట్టి, కొండ మట్టి కొల్లగొట్టారు. ట్రాక్టర్‌కు రూ.1,500, లారీకి రూ.8 వేలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకా కొనసాగితే చెరువుల భద్రతకు, కొండల ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితి దాపురించింది. గతంలో కలెక్టర్‌ స్థాయి వరకు ఫిర్యాదులు వెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. తమ పరిధి కాదంటూ అటవీ శాఖ, పంచాయతీరాజ్‌, మైనింగ్‌ శాఖలు పరస్పరం నెట్టుకుంటూ మాఫియాకు సహకరిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. మట్టి మాఫియాకు చెందిన భారీ వాహనాలు అధిక వేగంతో, అధిక లోడుతో వెళ్తుండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏంటని ప్రశ్నించిన గ్రామస్తులపై మట్టి మాఫియా బెదిరింపులకు పాల్పడుతోంది.

సహజ వనరులను

కొల్లగొడుతున్న టీడీపీ నేతలు

మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు

అధికారుల దాసోహం

నిత్యం భారీ వాహనాల

రాకపోకల కారణంగా ప్రమాదాలు

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ మట్టం బుధవారం 513.30 అడుగులకు చేరింది. ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది.

అక్రమ మట్టి మైనింగ్‌ టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. సహజ వనరులను ఆస్తులను కాపాడాల్సిన టీడీపీ ప్రభుత్వం ఆ బాధ్యతనే మరచింది. జిల్లావ్యాప్తంగా మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నా అధికారుల కంటపడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలోని నల్ల ఎర్ర చెరువుతోపాటు చేజర్ల గ్రామంలో కొండ మట్టిని తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement