జీతాలు సకాలంలో అందజేయాలి | - | Sakshi
Sakshi News home page

జీతాలు సకాలంలో అందజేయాలి

Jul 23 2026 2:24 AM | Updated on Jul 23 2026 2:24 AM

ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు

నరసరావుపేట: జిల్లాలో ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా డీడీఓలకు సూచించారు. కలెక్టర్‌ కార్యాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం బుధవారం నిర్వహించారు. ఇక నుంచి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రతినెలా మూడవ శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్‌ 23 జరిగిన సమావేశంలో అందిన ఫిర్యాదులను ఎండార్స్‌ చేసి అన్నీ జిల్లా అధికారులకు పంపించామని, వారి నుంచి ఎటువంటి యాక్షన్‌ తీసుకున్నది తెలియరాలేదన్నారు. రిపోర్టులను ఇన్‌టైంలో అందించాలన్నారు. కార్యాలయాల్లో కంప్లైంట్‌ బాక్సులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం భోజన పథకం అమలు నిర్వహించే వారికి జూన్‌ వరకు చెల్లింపు జరిగాయని తెలిపారు. ఏఎన్‌ఎంల నుంచి సూపర్‌వైజర్‌గా ప్రమోషన్‌ పొందే విషయమై డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ గైడ్‌లైన్స్‌ ప్రకారం సీనియారిటీ ఉన్నవాళ్లకి ఏఎన్‌ఎం ప్రమోషన్‌ చేయవవచ్చని తెలిపారు. మృతి చెందిన ఉద్యోగస్తుల మట్టి ఖర్చులకు ట్రెజరీ అధికారులు డెత్‌ సర్టిఫికెట్‌ అడుగుతున్నారనే ఫిర్యాదుపై మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. పెన్షన్‌ పేపర్లు డీడీఓ లెవెల్‌లో ఆలస్యం కాకుండా సబ్‌మిట్‌ చేయాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వాష్‌రూమ్‌లు సరిగా లేవని ఫిర్యాదులు వస్తున్నాయని అవి సరిగా ఉండే విధంగా చూడాలని జిల్లా అధికారులకు సూచించారు. తాగునీరు, శానిటేషన్‌ సరిగా లేవని జిల్లా అధికారులు వీటిపై దృష్టి పెట్టాలని కలెక్టర్‌ కోరారు. జిల్లాలో పరిష్కరించే సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని, ప్రభుత్వానికి నివేదించే సమస్యలు ఉంటే ప్రపోజల్‌ పెట్టాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు.

సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నాం

నరసరావుపేట: సంక్షేమ హాస్టల్‌ విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సమకూర్చుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో షెడ్యూల్‌ కులాలు చెందిన బాలికలకు నైట్‌ డ్రెస్సులు, టవల్స్‌, రగ్గులు పంపిణీ ప్రారంభించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మయ్య మాట్లాడుతూ జిల్లాలో 29 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, అందులో 18 బాలురు, 11 బాలికల వసతి గృహాలు ఉన్నాయని, అందులో మొత్తం 3500 మందికి పైగా విద్యార్థినీ విద్యార్ధులు ఉన్నారన్నారు. సాంఘిక సంక్షేమశాఖకు ప్రభుత్వ స్థలం కేటాయిస్తే హాస్టల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి ఏర్పాటు చేసుకుంటామని కలెక్టర్‌ను కోరారు. అనంతరం కలెక్టర్‌ హాస్టల్లో తనిఖీ చేశారు. వార్డెన్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

తరగతి గదులు, టాయిలెట్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయండి

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతుల గదులు, టాయిలెట్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 80 శాతం పనులు పూర్తయిన 60 స్కూళ్లలో 218 అదనపు తరగతి గదులు నిర్మాణం, 23 టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో 31 పాఠశాలలో 116 అదనపు తరగతి గదులు పూర్తయ్యాయని, 11 టాయిలెట్లు పూర్తయినట్లు విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు పాల్గొన్నారు.

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో

డీడీఓలకు సూచించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement