నకరికల్లు: మండలంలోని నర్శింగపాడులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్‌లను రెవెన్యూ అధికారులు బుధవారం రాత్రి స్వాఽధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్‌లను సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తహసీల్దార్ కె.పుల్లారావు మాట్లాడుతూ నర్శింగపాడు గ్రామంలోని పూరిబోడు ప్రాంతంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు పోలీసులు, సిబ్బందితో దాడులు నిర్వహించి రెండు ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అక్రమమైనింగ్‌ను అరికట్టేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమంగా మట్టిని తరలించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఆర్‌ఐ సిద్దయ్య, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మైనింగ్ విషయమై కుంకలగుంట పెద్దఎత్తున నిరసనలు వచ్చిన రోజే నర్శింగపాడులో అక్రమమైనింగ్ జరగడంతో అధికారుల నిఘాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


