నాకు గ్రామంలో సొంత ఇల్లు లేదు. వితంతువును. కుమారుడు ఉన్నాడు. ఎస్‌టీ కాలనీ ఏర్పడిన సమయంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం చేశారు. దాని పక్కన ఉన్న రెండు సెంట్ల స్థలంలో ఇల్లు వేసుకునేందుకు ప్రయత్నించగా ఓసీ కులానికి చెందిన ద్రోణాదుల రాంబాబు, అనుచరులు వచ్చి తహసీల్దార్ పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి నన్ను అడ్డుకున్నారు. ఎస్‌టీ కాలనీలో ఓసీకి స్థలం ఎలా ఇస్తారంటూ నేను ఆర్‌టీఐ ద్వారా తహసీల్దార్‌కు సమాచారం కోసం దరఖాస్తు చేయగా... టువంటి సమాచారం లేదంటూ తెలిపారు. నాకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని పీజీఆర్‌ఎస్‌లో ఇప్పటికే రెండుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం దక్కలేదు. వెంటనే ఇచ్చేలా తహసీల్దార్‌ను ఆదేశించాలి. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.
– పాలపర్తి రమణ, ఇరుకుపాలెం, ముప్పాళ్ల మండలం


