సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య
చిలకలూరిపేట: నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దర్మేంధ్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో జాతీయ రహదారిపై సోమవారం ధర్నా నిర్వహించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ ఢిల్లీలో సోనం వాంగ్‌చుక్ దాదాపు 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా, ఆయన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గత 12 ఏళ్ల కాలంలో 29 సార్లు వివిధ పేపర్ లీకేజీల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష పత్రాలు లీకుకు కారణమైన కేంద్ర విద్యాశాఖామంత్రి రాజీనామా చేయాలని, ఈ విషయానికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్రమోదీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.


