నరసరావుపేట ఈస్ట్: ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదవుతున్న కడియాల అభయ్ తన అసాధార ణ జ్ఞాపకశక్తితో ఇండి యా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సాధించినట్టు పాఠశాల ప్రిన్సిపల్ తేజస్విని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభయ్ కేవలం 5 నిమిషాలలో ప్రపంచ పటం నుంచి 90 దేశాల పేర్లు, వాటి రాజధానులను అనర్గళంగా చెప్పి ఇండియా బుక్‌లో స్థానం సాధించాడని వివరించారు. వైద్యులు డాక్టర్ గొట్టిపాటి లలిత్‌సాగర్, డాక్టర్ లక్ష్మి తమ కుమారుడు అభయ్ ప్రతిభను గుర్తించి ఇండియా బుక్ ప్రదర్శన నిర్వహించారని తెలిపారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్.ప్రకాశరావు, డైరెక్టర్ ఎన్.సబిత, అభినందనలు తెలిపారు.


