సీఐపై కేసు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

సీఐపై కేసు నమోదు చేయాలి

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

సీఐపై కేసు నమోదు చేయాలి

టీడీపీ ప్రభుత్వంలో పోలీసులే దొంగతనం, గూండాయిజం చేస్తున్నారు. ఇందుకా చంద్రబాబుకు ప్రజలు అధికారం ఇచ్చింది. సురేంద్ర అనే దళిత యువకుడిని సంవత్సరం క్రితం పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి భయపెట్టి రూ.30 లక్షలకు పైగా వసూలు చేశారు. ఆస్తులు అమ్మి కట్టాడు. అయినా ఆగకుండా అతనిపై ఆదివారం మరో అక్రమ కేసు బనాయించి నానామాటలు అంటూ సీఐ వెంకట్రావు తీవ్ర వేధింపులకు దిగాడు. దీంతో చేసేదేమిలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏసు ప్రభువు దయవల్ల ఆ యువకుడు బతికాడు. సీఐపై వెంటనే కేసు నమోదు చేసి, ఆ స్టేషన్‌ విధుల నుంచి తప్పించాలని ఎస్పీని కలిశాం. హైకోర్టులో కేసు వేస్తాం. జగనన్న ప్రభుత్వం రాగానే ఆ స్టేషన్‌లోనే కేసు నమోదు చేసి చట్టప్రకారం అరెస్ట్‌ చేయిస్తాం.

– కాసు మహేష్‌రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement