గుంటూరురోడ్డు పెద్ద మసీదులో ప్రార్థనలు
ప్రకాష్‌నగర్ ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు
ప్రేమ, త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని గురువారం ముస్లింలు ఆనందోత్సవాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. నరసరావుపేట ప్రకాష్‌నగర్‌లో గల ఈద్గా మైదానం, గుంటూరురోడ్డులోని నాయబ్ బజారు పెద్ద మసీదులో వందలాదిమంది ముస్లింలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సమస్త మానవాళికి శాంతి చేకూర్చాలని ప్రార్థించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. – నరసరావుపేట


