వైఎస్సార్‌ సీపీ మరింత బలోపేతంపై చర్చ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ మరింత బలోపేతంపై చర్చ

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

వైఎస్సార్‌ సీపీ మరింత బలోపేతంపై చర్చ

మాచర్ల రూరల్‌: రానున్న రోజుల్లో వైఎస్సార్‌ సీపీని మరింత బలోపేతం చేయడంతోపాటు చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలపై రాజ్యసభ సభ్యుడు, పార్టీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డితో బుధవారం ఆయన నివాసంలో పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) చర్చించారు. సూపర్‌ సిక్స్‌ పేరుతో ప్రజలను ప్రలోభపెట్టిన చంద్రబాబు గెలిచాక దారుణంగా మోసం చేశారని, చంద్రబాబు రెండేళ్ల పాలన అక్రమాలకు, అరాచకాలకు, అబద్ధాలకు, దోపిడీలకు పరిమితమైన నేపథ్యంలో దానిపై వారు చర్చించారు. ఎన్నికల ముందు 143 రకాల హామీలతో అధికారంలోకి వచ్చి నేడు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్‌ వంటి ప్రధాన హామీలను నెరవేర్చలేని పరిస్థితి నెలకొందని పీఆర్కే తెలిపారు. నిరుద్యోగులను మోసం చేస్తూ డీఎస్‌సీలోనూ అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో ఆ విషయాన్ని ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాల్సిన తీరుపై వారు చర్చించారు. ‘సర్‌’ పేరిట ఓటర్‌ జాబితా సవరణలో ప్రతి బూత్‌ ఏజెంటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఇచ్చిన పిలుపు మేరకు పల్నాడు జిల్లాలో చేపట్టనున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

పార్టీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌

సుబ్బారెడ్డితో సమావేశమైన పీఆర్కే

Advertisement
 
Advertisement
Advertisement