జిల్లాలో 27 శిబిరాల నిర్వహణ
నిమ్మకాయల ధరలు
పులిచింతల సమాచారం
● తల్లిదండ్రులు ఉంటున్న
ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం
● త్రుటిలో తప్పించుకున్న కన్నవారు
● ఆస్తివివాదాల నేపధ్యంలో ఘటన
7
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ముఖ మండపంలో బుధవారం స్వామికి ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన కనుల విందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మల్లెలు, చేమంతి, గులాబి, తులసి దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్ పర్యవేక్షించారు.
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాలస్వామివారి దేవస్థానంలో బుధవారం నూతన జీవ ధ్వజ స్తంభం పునఃప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో మంతెన విఠల్ శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ నూతన జీవ ధ్వజ స్తంభ పునః ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ వారు నిర్వహించారని తెలిపారు.
మాచవరం: పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో అంకమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో వేదమంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బంధువుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
తెనాలిరూరల్: ప్రైవేటు వ్యక్తులు సాగు చేసుకుంటున్న సుమారు రూ.ఐదు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహాల వెనుక పొలాల్లో 2012లో ప్రభుత్వం సేకరించిన 61 సెంట్ల భూమి ఉంది. అనేక కారణాలతో అది ఖాళీగా ఉండడంతో అక్కడ పొలాలు సాగు చేసే రైతులే ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రైతు రత్తయ్య తాను కౌలుకు తీసుకున్న పొలాలతో పాటు ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల జరిపిన రీ సర్వేలో 61 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నటు తహసీల్దార్ గుర్తించారు. ఈ నేపథ్యంలో సాగుదారుడితో మాట్లాడి భూమిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో భూమి విలువ సుమారు రూ. ఐదు కోట్లు ఉంటుంది.
యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో కొలువైన శ్రీభూ సమేత రంగనాయకస్వామి ఆలయ వార్షిక కళ్యాణ మహోత్సవాలు బుధవారం కొనసాగాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకుడు పరుచూరి రామకృష్ణ చార్యుల నేతృత్వంలో మూలవిరాట్‌లతో పాటు నవవధువరులుగా ఉత్సవ మూర్తులను విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి సుప్రభాతసేవ, బిందతీర్థం, నిత్యార్చన, హోమ, గ్రామబలిహరణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీలక్ష్మీ అమ్మవారికి నిర్వహించిన సామూహిక సహస్రనామ కుంకుమార్చన పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా రాత్రివేళ స్వామివారి ఉత్సవమూర్తిని భారీ విద్యుత్ అలంకరణ చేసిన హనుమత్ వాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సాగిన ఈ వాహనసేవను వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్ –నాగజ్యోతి, అర్వపల్లి బ్రదర్స్‌తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
కన్నకూతురు ఘాతుకం
చిలకలూరిపేట: ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను కుమార్తె కాల్చి హతమార్చేందుకు యత్నించిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత తల్లిదండ్రులు గౌరిశెట్టి సుకన్య, మల్లిఖార్జునరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుకన్య, మల్లిఖార్జునరావు దంపతులకు ఇరువురు కుమార్తెలు. చిన్న కుమార్తె చంద్రికకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్ల పాప దేవసేన ఉంది. భర్తతో వివాదాల నేపథ్యంలో మూడేళ్ల కిందట విడాకులు తీసుకుంది. పాపతో కలసి రెండేళ్ల కిందిటి వరకు పట్టణంలోని గుర్రాలచావిడిలో ఉన్న తల్లిదండ్రుల వద్దే ఉండేది. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం.. ఏడాది నుంచి మరో వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తూ పాపను తల్లిదండ్రుల వద్దే వదిలివేసి ఉంటుంది. ఈ క్రమంలో తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి 9గంటల సమయంలో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి గొడవకు దిగింది. దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని లోనికి పరిగెత్తి తలుపులు మూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన చంద్రిక పంచలో ఉన్న గ్రిల్స్ నుంచి లోపలికి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టింది. మంటలు, పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు పోసి మంటలను చల్లార్చారు. ఇంటి పంచలో ఉన్న మంచాలు, బ్యాగులు తగలబడి పోయాయి. అయితే స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయమై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించి, చంద్రికను విచారిస్తున్నారు.
ఇక ఆటవిడుపు
ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటకు కార్యాచరణ సిద్ధం చేశాం. జిల్లా మొత్తంగా 27 శిబిరాలు ఏర్పాటు చేయనున్నాం. 14 రకాల క్రీడా అంశాలను నిర్వహించనున్నాం. ఈ మేరకు క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాం. ఎంపిక చేసిన ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తాం.
– పి.నరసింహారెడ్డి,
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి
సత్తెనపల్లి: వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత సేద తీరుతుంటారు. వేసవి సెలవుల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో గడపాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. కొందరు చిన్నారులు సెల్‌ఫోన్‌లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. వారి దృష్టి మళ్లించి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. మే 1 నుంచి 31 వరకు జిల్లాలోని 27 నిర్ణీత ప్రాంతాల్లో నిర్వహించేందుకు శిక్షకులను నియమించనున్నారు. ఒక్కో శిబిరానికి రూ.10 వేలు శాప్ కేటాయించనుంది. జిల్లాలో 27 ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహణకు శాప్ అనుమతులు జారీ చేసింది.
● 8 నుంచి 16 సంవత్సరాల లోపు వయసుగల బాల బాలికలకు అవకాశం కల్పిస్తారు.
● అర్చరీ, అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, ఫెన్సింగ్, హ్యాండ్‌బాల్, ఖోఖో, కబడ్డీ, కరాటే, సాఫ్ట్‌బాల్, తైక్వాండో, వాలీబాల్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
● ఏ ఏ ప్రాంతాల్లో ఏ క్రీడాంశంలో శిక్షణ ఇస్తారనేది జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రకటించనుంది.
● ఇందుకోసం శిక్షకులను ఎంపిక చేశారు. శిక్షకులకు, క్రీడా సామాగ్రికి అయ్యే ఖర్చును శాప్ భరిస్తుంది. ఆటలు ఆడించడానికి ఒక్కో శిబిరంలో ఒక కోచ్ లేదా ఒక సీనియర్ పీఈటీ ఉంటారు. శిబిరాలు నిర్వహించే మైదానాల్లో మంచినీటి వసతి, మెడికల్ కిట్ అందుబాటులో ఉంచుతారు.
తెనాలి: కొలకలూరులో కొలంకపూరి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు మే నెల 2,3,4,5 తేదీల్లో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) సౌజన్యంతో జరిగే ఈ పోటీలు ఈసారి కొలకలూరు పంచాయతీ పరిధిలోని ఖాజీపేట నాటకశాల వద్ద ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల్నుంచి జరుగుతాయని కళాపరిషత్ కార్యదర్శి గోపరాజు విజయ్ బుధవారం ప్రకటించారు. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజున గోపరాజు బాల త్రిపురసుందరమ్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటీమణి దాసరి రమాదేవి (హైదరాబాద్‌కు ప్రదానం చేస్తారు. 3వ తేదీ రాత్రి కరణం సురేష్ జ్ఞాపకార్ధం ఏటా ఇస్తున్న సవ్యసాచి అవార్డును ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటుడు డాక్టర్ వెంకట్ గోవాడ (హైదరాబాద్), గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని రంగస్థల నటి ఎస్.జ్యోతిరాణి (విజయనగరం)లకు బహూకరిస్తారు. 4వ తేదీన కొలంకపురి కళాపరిషత్ రచనల పోటీల విజేతలకు నగదు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుంది. చివరిరోజున గోపరాజు చక్రపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటుడు డాక్టర్ సీఎస్ ప్రసాద్ (కాకినాడ)కు అందజేసి సత్కరిస్తారు.
మైదానానికి రండి...ఆటల్లో మెరవండి
రేపటి నుంచి జిల్లాలో
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
నెలరోజుల పాటు నిర్వహణకు
ఏర్పాట్లు పూర్తి
14 క్రీడాంశాల్లో శిక్షణ
జిల్లాలో 27 శిబిరాల్లో శిక్షణకు
కార్యాచరణ
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6000, గరిష్ట ధర రూ.9600, మోడల్ ధర రూ.7200 వరకు పలికింది.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ
33.9320 టీఎంసీలు.


