చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తికి రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తికి రిమాండ్‌

Apr 30 2026 8:37 AM | Updated on Apr 30 2026 8:37 AM

నాదెండ్ల: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తికి బుధవారం న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. ఈ నెల 19న గణపవరంలో ఆరేళ్ళ చిన్నారిపై ఒడిశాకు చెందిన ప్రసాద్‌దాస్‌మాలిక్‌ లైంగిక దాడికి యత్నించాడు. ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలికను తన గదిలోకి తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేయటంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి వాతలు పెట్టారు. పోలీసులకు సమాచారమివ్వటంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. గాయాలైన నిందితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బుధవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్‌ విధించారు.

లివర్‌ మార్పిడి కోసం ఆర్థిక సహాయం చేయండి

శావల్యాపురం: మండలంలోని మతుకుమల్లికి చెందిన మల్నీడి సుస్మిత లివర్‌ డ్యామేజ్‌ కావటంతో గత కొద్ది కాలంగా చికిత్స పొందుతోంది. నిరుపేద రైతు కుటుంబలో జన్మించిన సుస్మిత ప్రస్తుతం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల్లో 9వ తరగతి చదువుతోంది. తండ్రి మూగవాడు కావటం రెక్కడితే డొక్కాడిన కుటుంబ కావటం ఇప్పుటికే వైద్య ఖర్చుల నిమిత్తం రూ.8 లక్షల వెచ్చించారు. లివర్‌ మార్పిడి నిమిత్తం వైద్యసేవలు కోసం రూ.30 లక్షలు అవసరమని వైద్యులు చెబుతున్నట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దాతలు సాయం చేసి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని కుటుంబ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా అభ్యర్థించారు. వివరాల కోసం 6301041236 నంబరు సంప్రదించాలన్నాని కోరారు.

ద్విచక్రవాహనం ఢీకొని మహిళ మృతి

పిడుగురాళ్ల రూరల్‌: అతివేగంగా వస్తున్న స్పోర్ట్స్‌ బైక్‌ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన పిడుగురాళ్ల శివారులోని అయ్యప్పనగర్‌ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అయ్యప్పనగర్‌కు చెందిన యు.రాజ్యలక్ష్మి రోడ్డు దాటుతున్న సమయంలో హైదరాబాద్‌ వైపు నుంచి స్పోర్ట్స్‌ బైక్‌పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో రాజ్యలక్ష్మి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement