ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 87.84 లక్షలు స్వాహా | - | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 87.84 లక్షలు స్వాహా

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

సీఎంఎస్‌ ఉద్యోగి చేతివాటం ఆడిట్‌లో వెలుగులోకి మోసం

పిడుగురాళ్ల: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బానిసై ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 87.84లక్షలను సీఎంఎస్‌ ఉద్యోగి స్వాహా చేసినట్లు గురజాల డీఎస్పీ మల్లా మహేశ్వరరావు తెలిపారు. పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు... సీఎంఎస్‌వో కంపెనీ మేనేజర్‌ అనిల్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయటం జరిగిందని, క్యాస్‌ కస్టోడీగా పని చేసే మామిడి నరేష్‌ రూ. 87,84,900 నగదును తన సొంత అవసరాలు, ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ యాప్‌లలో పెట్టింగ్‌లు పెట్టాడని విచారణ తెలిసిందన్నారు. నరేష్‌ ఇదే కంపెనీలో 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడన్నారు. సీఎంఎస్‌ కంపెనీ వారు వారానికి ఒక సారి నిర్వహించే ఆడిట్‌లో రూ. 87,84,900లు తేడా ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు. పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్‌ఐ శివనాగరాజు, సిబ్బంది ఉదయం బైపాస్‌ రోడ్డులో మామిడి నరేష్‌ను పట్టుకోవటం జరిగిందన్నారు. అతని వద్ద నుంచి రూ. 25,53,000లను స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. ఆ నగదును అతని ఖాతా, అతని భార్య ఖాతాలో ఉంచుకుని వాడుకొని ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ చేస్తూ మొత్తం ఖర్చు చేసుకున్నట్లు విచారణ తెలిసిందన్నారు. నిందితుడు మామిడి నరేష్‌ను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement