దాచేపల్లి: వీర్ల అంకమ్మతల్లి కొలుపుల తిరునాళ్ల సందర్భంగా దాచేపల్లిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు మంగళవారం హోరహొరీగా సాగాయి. అంకమ్మతల్లి ఆలయం ప్రాంగణంలో నాలుగు పళ్ల విభాగంలో జరిగిన ఎడ్ల బలప్రదర్శన పోటీలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకి చెందిన అత్తోట శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత 5591 అడుగుల దూరం బండలాగి విజేతగా నిలిచాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడుకి చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్ ఎడ్ల జత 5550 అడుగుల దూరం బండలాగి రెండవ స్థానం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకి చెందిన పిడుగురాళ్ల జెడ్పీటీసీ జంగా వెంకటకోటయ్య, జంగా సురేష్ ఎడ్ల జత 5000 అడుగుల దూరం బండలాగి మూడవస్థానం, పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడికి చెందిన బొమ్మిన పద్మావతి నాయుడు, శివమణి నాయుడు ఎడ్ల జత 4750 అడుగుల దూరం బండలాగి నాలుగవ స్థానం, పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెంకి చెందిన అంబటి ఆంజనేయులు ఎడ్లజత 3,339 అడుగుల దూరం బండలాగి ఐదవస్థానం, పల్నాడు జిల్లా గురజాల మండలం అంబాపురంకి చెందిన చుండూరి సీతారామయ్య ఎడ్లజత 1500 అడుగుల దూరం బండలాగి ఆరవ స్థానంలో నిలిచాయి. విజేతలుగా నిలిచిన ఎడ్లజత రైతులకు నగదు, షీల్డ్స్‌ని నిర్వహకులు, కమిటీ సభ్యులు అందజేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా గుడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, కూరకుల దిలీప్, కానుకొళ్లు ప్రశాంత్, తోట వెంకటేశ్వర్లు, యలమల నరేష్ తదితరులు ఈ పోటీలను పర్యవేక్షించారు.
బలప్రదర్శన పోటీల్లో
పెదగొట్టిపాడు ఎడ్ల సత్తా
మాచవరం: మండలంలోని కొత్తపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి 21వ కల్యాణ ఉత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలస్థాయి ఎడ్ల బలప్రదర్శన బండలాగుడు పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎడ్ల జత 3522 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచి బహుమతులు అందుకున్నాయి. అత్తోట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి (వేటపాలెం, చుండూరు మండలం బాపట్ల జిల్లా) ఎడ్లు 3511 అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో, బోని గళ్ళ గాయత్రి (పొట్లపాడు, కురిచేడు మండలం ప్రకాశం జిల్లా) ఎడ్లు 3359 అడుగుల దూరాన్ని లాగి మూడవ స్థానంలో, సంపటం వీరబ్రహ్మం నాయుడు ( ఉయ్యందున, క్రోసూరు మండలం గుంటూరు జిల్లా) ఎడ్లు 3009 అడుగులు, యామిని రామారావు (కొత్తపాలెం మాచవరం మండలం పల్నాడు జిల్లా) ఎడ్లు 2773 అడుగుల దూరం లాగి వరుస స్థానాల్లో నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
నాలుగు పళ్ల విభాగం విజేత
బాపట్ల జిల్లా వేటపాలెం ఎడ్లజత


