మట్టి మాఫియాపై చర్యలకు ఆదేశాలు | - | Sakshi
Sakshi News home page

మట్టి మాఫియాపై చర్యలకు ఆదేశాలు

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

వినుకొండ: ‘అక్రమ మట్టి మాఫియాపై స్థానికుల కన్నెర్ర’ శీర్షికన ఈ నెల 26వ తేదీన సాక్షి ప్రచురితమైన కథనానికి స్పందించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయు లు, అధికారులు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జీవీ మాట్లాడుతూ అక్రమ మట్టి మాఫియాపై చర్యలు చేపట్టాలని జేసీని ఆదేశించారు. అక్రమ మైనింగ్‌పై రెవెన్యూ, పోలీస్‌, మైనింగ్‌ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై స్పందించిన జేసీ సంజనా సింహ మాట్లాడుతూ అక్రమంగా మైనింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అక్రమ మైనింగ్‌ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలతో పాటు జరిమానాలు వేయడం జరుగుతుందని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement