ప్రజా సమస్యలకు చట్టబద్ధ పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలకు చట్టబద్ధ పరిష్కారం

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

నరసరావుపేట రూరల్‌: ప్రజా సమస్యలను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. అదనపు ఎస్పీ సంతోష్‌ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 66 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. విచారణను వేగంగా పూర్తిచేసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు.

జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్‌

జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌

వివిధ సమస్యలపై 66 ఫిర్యాదులు

Advertisement
 
Advertisement
Advertisement