అన్ని మండలాలు స్టాక్‌ పాయింట్లు సిద్ధం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అన్ని మండలాలు స్టాక్‌ పాయింట్లు సిద్ధం చేసుకోవాలి

Apr 28 2026 8:05 AM | Updated on Apr 28 2026 8:05 AM

పిడుగురాళ్ల: జిల్లాలోని అన్ని మండలాలు వెంటనే స్టాక్‌ పాయింట్లను సిద్ధం చేసుకోవాలని సమగ్రశిక్ష సీఎంవో పి. పద్మారావు, ఏపీవో పి.శంకర్‌రాజు తెలిపారు. పట్టణంలోని మండల విద్యా వనరుల కేంద్రంలోని స్టాక్‌ పాయింట్‌ను సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... మే 1వ తేదీ నుంచి జిల్లా నుంచి మండలాలకు సరఫరా అయ్యే మెటీరియల్‌, పాఠ్యపుస్తకాలను జాగ్రత్తగా తీసుకొని భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని అన్నారు. పాఠశాలలకు చేరాల్సిన పుస్తకాలు, కిడ్స్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ దిశగా జిల్లాలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల విద్యా శాఖ అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన తెలిపారు. దీనిలో భాగంగానే నకరికల్లు, పిడుగురాళ్ల, రాజుపాలెం మండలాల స్టాక్‌ పాయింట్లను పరిశీలించటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఎండీ ఖాశీం, ఎంఐఎస్‌ కో–ఆర్డినేటర్‌ వీర నారాయణమ్మ, సీఆర్‌పీలు నాగేశ్వరరావు, చాంద్‌బి, పార్వతయ్య, సాగర్‌రాజు తదితరులు ఉన్నారు.

జిల్లా సమగ్ర శిక్ష సీఎంవో పి.పద్మారావు, ఏపీవో పి.శంకర్‌రాజు

Advertisement
 
Advertisement
Advertisement