న్యూస్‌రీల్
జిల్లాలో దొరకని డీజిల్, పెట్రోల్
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు.
అంకమ్మతల్లికి పూజలు
దాచేపల్లి:స్థానిక వీర్ల అంకమ్మతల్లి కొలుపు ల తిరునాళ్ల సందర్భంగా సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.
నిమ్మకాయల ధరలు
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.10,000, మోడల్ ధర రూ.7,000 వరకు పలికింది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు అన్నపురెడ్డి రంగమోహనరెడ్డి, ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామం. ప్రస్తుతం ఏడెకరాల్లో మొక్కజొన్న, వరి పంట సాగు చేశాడు. అవి కోత దశలో ఉన్నాయి. డీజల్ లేకపోవడంతో కోత మిషన్లు రాలేదు. మొక్కజొన్న కోత నిలిచిపోయింది. అవసరాల కోసం కొన్న ట్రాక్టర్ సైతం ఇంటి వద్దే ఉంచుకోవాల్సి వచ్చింది. రైతు అవసరాలకు సరిపడా డీజల్‌ను కూడా సరఫరా చేయలేకపోవడం విచారకరం. ఈ పరిస్థితి కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ ఫొటోలో కనిపిస్తోంది పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిసరాలలో జిల్లా రెవెన్యూ శాఖ స్వయంగా నిర్వహిస్తున్న పెట్రోల్ పంపు. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ కొరత లేదంటూ జిల్లా అధికారులు ఓ వైపు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తుంటే మరో పక్క ఈ బంక్‌లో మాత్రం నోస్టాక్ బోర్డు పెట్టారు. ప్రతి మండలానికి ఇంధన కొరత లేకుండా మానటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించిన జిల్లా ఉన్నతాధికారులు.. కలెక్టరేట్‌లో ఎందుకు పెట్రోల్ పంపు తెరిపించలేకపోయారంటూ సోమవారం ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన అర్జీదారులు ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు చెబుతున్న వాటికి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పొంతన లేదంటున్నారు.
డీజల్ కొరత కారణంగా రెండు రోజులుగా ఆటో తిప్పడం లేదు. దీంతో ఇంట్లో గడవడమే కష్టంగా ఉంది. సోమవారం కలెక్టర్ వస్తున్నారని కొన్ని బంకుల్లో రెండు మూడు లీటర్ల డీజల్ కొట్టారు. ఆ డీజిల్ ఒకపూట ఆటో తిప్పడానికే సరిపోతుంది. ఇప్పటికే ఫ్రీ బస్సు ద్వారా ఆటో డ్రైవర్ల పూట గడవటం కష్టంగా ఉన్న తరుణంలో డీజల్ కొరతతో ఆటోల మీద ఆధారపడిన లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో పడనున్నాయి.
–దుమ్మాల ఏలియా, ఆటోడ్రైవర్,
ఇరుకుపాలెం, సత్తెనపల్లి మండలం
7


