నరసరావుపేట రూరల్: ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మహిళలను కించపరిచే విధంగా ఏబీఎన్ ఛానల్‌లో ప్రసారమైన కథనంపై వెంటనే చర్యలు చేపట్టాలని సోమవారం జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్‌కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డిలు పాల్గొన్నారు. అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచే విధంగా అసభ్యపదజాలంతో ఏబీఎన్ ఛానెల్‌లో ప్రసారమైన కథనానికి నిరసనగా ఈనెల 9వ తేదీన జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీనిపై పోలీసులు స్పందించకుండా ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను కోరినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టబోమని పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు. అధికారం అండతో లక్షలాది మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతిసేలా మాట్లాడటం దారుణమన్నారు. ప్రభుత్వంపై చిన్న విమర్శ చేస్తేనే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని, లక్షలాది మంది కార్యకర్తలను కించపరిచిన వ్యక్తిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకుల భార్యలను అవమానించిన ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇప్పటి వరకు క్షమాపణ చెప్పకపోగా, మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ పరిశీలకులు రేపాల శ్రీనివాసరావు, మాచర్ల నియెజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు ఎనముల మురళీధర్‌రెడ్డి, గురజాల నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్, వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలి
Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM
● జిల్లా పోలీసు కార్యాలయంలో వైఎస్సార్ సీపీ నాయకుల ఫిర్యాదు
● పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడుపిన్నెల్లి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి, సమన్వయకర్తలు
Advertisement


