కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌

Apr 28 2026 7:41 AM | Updated on Apr 28 2026 7:41 AM

నరసరావుపేట రూరల్‌: పీజీఆర్‌ఎస్‌లో అందిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టితో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి నారదముని తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. డిఆర్‌వో నారదముని కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలతో 232 అర్జీలు అధికారులకు అందాయి. ఈ సందర్భంగా డీఆర్‌వో నారదముని మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలలో పరిష్కరించి ఆయా శాఖల పరిధిలోని పీజీఆర్‌ఎస్‌ గ్రీవెన్స్‌పై ఆడిట్‌ నిర్వహించాలని సూచించారు. జిల్లా అధికారులు వారి పరిధిలోని ఎలాంటి పెండింగ్‌ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement