గుంటూరు రూరల్: నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత రెండు రోజులుగా జరుగుతున్న కృష్ణ మండలం వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం శనివారంతో ముగిసింది. కార్యక్రమంలో ఏడీఆర్ డాక్టర్ దుర్గాప్రసాద్ గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల వివరాలను తెలిపారు. గత ఏడాది సూచనల ఆదారంగా చేపట్టిన కార్యక్రమాల వివరాలను సాయిల్ సైన్స్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి. శైలజ తెలిపారు. భూసార పరిరక్షణ కోసం జీవన ఎరువుల వినియోగం, అందుబాటులో ఉన్న నూతన యంత్రపరికరాలు, రానున్న సీజన్‌లో ఎన్‌నినో ప్రభావం వర్షపాతం, పంటల సాగుపై ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను రైతులు, శాస్త్రవేత్తలు చర్చించారు. వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు ఆయా పంటల్లో నూతన రకాలు, టెక్నాలజీలను వివరించారు. 2026–27 సంవత్సరానికి నిర్వహించాల్సిన పరిశోధనలు, కార్యక్రమాల కార్యాచరణపై చర్చించారు. కార్యక్రమంలో పరిశోధన ఇంచార్జ్ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి శివన్నారాయణ, వివిధ జిల్లాల డీఏవోలు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.
ముగిసిన సమావేశం
Apr 26 2026 2:33 AM | Updated on Apr 26 2026 2:33 AM
ముగిసిన సమావేశం రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత వైద్యం
గుంటూరు వెస్ట్: పీఎం రాహత్ పథకం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయి కాంత్ వర్మ శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఆవిష్కరించారు. పీఎం రాహత్ పథకం కింద ప్రతి బాధితునికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు చికిత్స ఖర్చును, ప్రమాదం జరిగిన తేదీ నుండి గరిష్టంగా 7 రోజుల వరకు అందిస్తారని తెలిపారు.
యువతిని వేధించిన
కేసులో వ్యక్తి అరెస్ట్
మంగళగిరి టౌన్ : విజయవాడ నుంచి మంగళగిరివైపు ఆటోలో వస్తున్న ఓ యువతిని వేధించి బెదిరింపులకు గురిచేసిన ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేసినట్లు మంగళగిరి నార్త్ సబ్‌డివిజన్ డిఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని రూరల్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్ధరాత్రి ఒంటరిగా ఆటోలో వస్తున్న యువతిని భయపెట్టి ఆమె నుంచి కొంత నగదు కూడా ఆటో డ్రైవర్ వసూలు చేసినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు నేరానికి ఉపయోగించిన ఆటోను, సెల్‌ఫోన్‌ను సీజ్ చేసినట్లు తెలియజేశారు. నిందితుడు తాడేపల్లి సీతానగరంకు చెందిన ఫణీంద్ర అన్నారు. రూరల్ సిఐ అవ్వారు వెంకట బ్రహ్మం, ఎస్‌ఐ సీహెచ్ వెంకట్, రైటర్ రామలింగేశ్వరరావు, పోలీస్‌సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement


