కోటప్పకొండ అభివృద్ధిపై మాస్టర్‌ప్లాన్‌ | - | Sakshi
Sakshi News home page

కోటప్పకొండ అభివృద్ధిపై మాస్టర్‌ప్లాన్‌

Apr 25 2026 7:24 AM | Updated on Apr 25 2026 7:24 AM

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల మాస్టర్‌ప్లాన్‌పై శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ కృతిక శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, డిఎఫ్‌వో కృష్ణప్రియ, ఆలయ ఈవో డి.చంద్రశేఖర్‌లు సమావేశంలో పాల్గొన్నారు. ధృమతరు కన్సల్టెంట్స్‌ సంస్థ అర్కిటెక్‌ సభ్యులు చేతనా జైన్‌, కె.రాజ్‌కుమార్‌లు మాస్టర్‌ప్లాన్‌ను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. వాహనాల పార్కింగ్‌ కాంప్లెక్స్‌, అన్నదాన సత్రం, షాఫింగ్‌ కాంప్లెక్స్‌ ప్రతిపాదనలను తెలియజేశారు. పాత మెట్ల మార్గానికి పక్కనే కొత్త మెట్ల మార్గం ప్రతిపాదించారు. ఇందులో ల్యాండింగ్‌ స్థలాలు, తాగునీటి పాయింట్లు, వాష్‌రూమ్‌లు, రిఫ్రెష్‌మెంట్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే యాత్రికులు, వీఐపీల కోసం డార్మిటరీలు, ప్రైవేటు గదులు, వీఐపీ కాటేజీలను మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచారు. ఆలయ ప్రవేశ, నిష్కమణ మార్గాలు, సామాన్లు భద్రపర్చుకునే గదులు, ట్రాఫిక్‌ నావిగేషన్‌ ప్లాన్‌లపై సమావేశంలో చర్చించారు. మాస్టర్‌ ప్లాన్‌ అధ్యయనం చేసి అదనపు సూచనలు ఉంటే తెలియజేయాలని అన్ని శాఖలను కలెక్టర్‌ ఆదేశించారు. దీనిపై ప్రణాళికలు సిద్ధం చేసి పనులను త్వరిగతిన పూర్తిచేయాలని తెలిపారు.

సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్‌

కృతిక శుక్లా, ఎస్పీ కృష్ణారావు

Advertisement
 
Advertisement
Advertisement