తూబాడు తాగునీటి చెరువులో అక్రమంగా మట్టితవ్వకాలు పక్కనున్న శ్మశానవాటిక ఆక్రమణకూ యత్నం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రక్షిత మంచినీటి చెరువును గత ప్రభుత్వ హయాంలో రూ.4 కోట్ల జల్‌జీవన్ మిషన్ ద్వారా కట్టలు బలోపేతం చేసి కే4–మైనర్ ద్వారా చెరువుకు నీరు నింపేందుకు పనులు చేపట్టారు.
ప్రభుత్వం మారటంతో కరకట్టలు, కాలువల మరమ్మతు పనులు పూర్తికాకుండానే నిలిచిపోయాయి. ప్రస్తుతం వర్షపునీరు, కె–మైనర్ ద్వారా వచ్చే నీటితోనే చెరువును నింపి ఊటబావుల ద్వారా గ్రామానికి తాగునీరు అందిస్తున్నారు.
జల్‌జీవన్ మిషన్ నిధులతో పనులు పూర్తిగా చేసి ఉంటే గ్రామంలో తాగునీటి ఎద్దడి లేకుండా పుష్కలంగా నీరందేదని స్థానికులు పేర్కొంటున్నారు. కూటమి నేతలు అడ్డగోలుగా చెరువును తవ్వేసి మట్టిని తరలిస్తుండటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై గ్రామస్తులు పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 20న జరిగిన గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అక్రమ మట్టి తవ్వకాలతో చెరువులో నీటి నిల్వ సామర్ధ్యం తగ్గిపోయి తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని, అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను నిలిపివేయించాలని కోరారు.
దీనిపై డిప్యూటీ తహసీల్దార్ షేక్ సల్మాన్‌ను వివరణ కోరగా, గ్రామంలోని చెరువు పక్కనే ఉన్న స్మశాన వాటికలో కొంతభాగాన్ని ఆక్రమించి చెరువులో మట్టి తోలుతున్నారని సమాచారమందిందన్నారు.
ఈ నెల 20న డీపీవో ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్ళి స్మశాన వాటికలో మట్టి తోలకాన్ని నిలిపివేయించారని తెలిపారు.
మాచవరం: మండలంలోని కొత్తపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతి సమేత నీలకంఠేశ్వర స్వామి 21వ కల్యాణోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని ఆలయ పూజారులు ప్రత్యేకంగా అలంకరించి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన పలువురు దంపతులు పీటలపై కూర్చొని స్వామి వారి కల్యాణం వైభవంగా జరిపించారు. పలు గ్రామాల ప్రజలు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
నాదెండ్ల: మండలంలోని తూబాడు గ్రామంలోని రక్షిత మంచినీటి చెరువులో కూటమి నేతలు అక్రమంగా మట్టి మైనింగ్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అంతేకాక పక్కనే ఉన్న స్మశానవాటికలో కొంతభాగాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా గత కొద్దిరోజులుగా రెండు పొక్లయినర్లు, 40 ట్రాక్టర్లతో యథేఛ్ఛగా మట్టి తవ్వుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడుకు రూ.800ల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.


