గౌరవ వేతనం ఇచ్చేస్తా.. టాయిలెట్లు నిర్మించండి | - | Sakshi
Sakshi News home page

గౌరవ వేతనం ఇచ్చేస్తా.. టాయిలెట్లు నిర్మించండి

Apr 23 2026 7:48 AM | Updated on Apr 23 2026 7:48 AM

గౌరవ వేతనం ఇచ్చేస్తా.. టాయిలెట్లు నిర్మించండి జిల్లాలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు పోలీసుల అదుపులో ఆటోడ్రైవర్‌ పురుగు మందు తాగి విద్యార్థి ఆత్మహత్య

జెడ్పీ సమావేశంలో అచ్చంపేట జెడ్పీటీసీ విజయప్రతాప్‌రెడ్డి

అచ్చంపేట: మండల కేంద్రమైన అచ్చంపేటలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ లేక 30 గ్రామానుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తన 5 సంవత్సరాల గౌరవ వేతనం ఉదారంగా ఇస్తానని.. వాటితో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలని అచ్చంపేట మండల జెడ్పీటీసీ సభ్యుడు తుమ్మా విజయప్రతాప్‌రెడ్డి కోరారు. గుంటూరు జెడ్పీ సమావేశపు హాలులో బుధవారం జరిగిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు గౌరవవేతనంగా నెలకు రూ.6వేలు ఇస్తున్నారని, 5 సంవత్సరాల గౌరవవేతనంగా యేడాదికి రూ.72వేలు చొప్పున 5 సంవత్సరాలకు వచ్చే రూ.3.36లక్షలను అచ్చంపేటలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించేందుకు ఉదారంగా ఇస్తానని జెడ్పీటీసీ చెప్పారు. అచ్చంపేటలో 30 గ్రామాలకు కలిపి ఒక్కటే పీహెచ్‌సీ ఉందని, దూర గ్రామాలనుంచి వైద్యంకోసం రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాస్తవానికి మాదిపాడులో రెండో పీహెచ్‌సీ మంజూరై అందులో సిబ్బంది కూడా మంజూరు అయినప్పటికీ పీహెచ్‌సీ భవనం లేకపోవడంతో అక్కడ పనిచేయాల్సిన సిబ్బంది కూడా అచ్చంపేటలోని పనిచేస్తున్నారన్నారు. వైద్యశాలకు పక్కా భవనం నిర్మించేంతవరకు తాడువాయి – మాదిపాడు మధ్యలో ఒక తాత్కాలిక భవనాన్ని అద్దెకు తీసుకుని పీహెచ్‌సీని నడపాలన్నారు. అలాట్‌ అయిన వైద్యసిబ్బందిని అక్కడకు తరలించాలని సమావేశంలో కోరారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు

సత్తెనపల్లి: అంతర్జాతీయ పరిణామాల (ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధం) నేపథ్యంలో ఎరువుల కొరతపై అపోహలతో రైతులు ఆందోళన చెందవద్దని, జిల్లాలోని ఎరువులు దుకాణాల్లో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం. జగ్గారావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలను స్థానిక వ్యవసాయ శాఖ అధికారి అమ్మకాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. రైతులు ఎవరికై నా ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి పంట లకు ఎరువుల అవసరమైతే స్థానిక వ్యవసాయ అధికారి అనుమతితో డీలర్లు ఎరువులు అమ్మకాలు జరపాలన్నారు. మండల వ్యవసాయ అధికారి అనుమతి లేకుండా ఎవరైనా రైతులకు ఎరువుల అమ్మకాలు జరిపిన యెడల అటువంటి డీలర్ల పై నిత్యావసర వస్తువుల చట్టం (ఇసీ చట్టం) 1955 ప్రకారం శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ముందుగా ఎరువుల దుకాణాల్లోని భౌతిక నిల్వలు, అమ్మకాలు పరిశీలించారు. ఆయనతోపాటు సత్తెనపల్లి సహాయ వ్యవసాయ సంచాల కులు బి.రవిబాబు, సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి బి. సుబ్బారెడ్డి, తదితరులు ఉన్నారు.

మాచర్ల: పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పనిచేస్తూ అనేకమందిపై లైంగిక వేధింపులకు పాల్పడి వీడియోలు తీయించి సస్పెండ్‌ అయిన ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ తరఫున పనిచేసిన ఆటో డ్రైవర్‌ రాం సైదులును పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ సందర్భంగా సైదులు తనకు ఏఎస్‌ఐ శ్రీనివాస్‌లు డబ్బులు ఇచ్చి, ప్రతి రోజూ హైవేపై తీసుకెళ్ళి తిప్పాడని చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎవరిని పట్టుకున్నా వీడియోలు తీయాలని చెప్పి ఆ తరువాత ఆయన సెల్‌ఫోన్‌ లోకి ఎక్కించుకొని లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఒప్పుకొన్నట్లు సమాచారం. ఇదంతా డబ్బులు కోసమే చేశానని సైదులు ఒప్పుకున్నాడని, పోలీసులు విచారణ చేసి నిందితుడి సెలఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఆటోను సీజ్‌ చేశారు. పోలీసులను వివరణ అడిగేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.

మాచర్ల రూరల్‌: కుటుంబ కలహాల నేపథ్యంలో విద్యార్థి పురుగుమందు తాగి మృతి చెందిన సంఘటన మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఎల్లాల వెంకటేశ్వర్లు (22) పట్టణంలోని ప్రైవేట్‌ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తల్లి చిన్నతనంలో మృతిచెందగా, తండ్రి గోవిందు ఉన్నాడు. ఇంట్లో ఏర్పడిన చిన్న వివాదంతో గడ్డి మందు తాగి తండ్రితో చెప్పాడు. వెంటనే మాచర్ల ప్రైవేట్‌ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌ హాస్పిటల్‌కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు విజయపురిసౌత్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement