విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని యువకుడు మృతి

Apr 23 2026 7:48 AM | Updated on Apr 23 2026 7:48 AM

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని యువకుడు మృతి

పిడుగురాళ్ల: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు డబ్బుల కోసం వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన పట్టణంలోని రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మీద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం...పిడుగురాళ్లకు చెందిన హసనెన్‌, అల్లాబడేలు ద్విచక్ర వాహనంపై కొండమోడులోని వీరమ్మ కాలనీలోని అల్లాబడే నాయనమ్మ ఇంటికి స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా డబ్బులు తీసుకొనివచ్చేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల రైల్వే ఓవర్‌ బ్రిడ్జి మీద విద్యుత్‌ పోల్‌కు తగిలి షేక్‌ హసనెన్‌(19) అక్కడిక్కడే మృతి చెందగా అల్లాబడేకి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఓప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట తరలించారు. పట్టణ ఎస్‌ఐ శివనాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement