ఆగ్రహ జ్వాల | - | Sakshi
Sakshi News home page

ఆగ్రహ జ్వాల

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

ఆగ్రహ జ్వాల వైఎస్సార్‌సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన గురువారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 నరసరావుపేట: ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తీరుపై ఆగ్రహజ్వాలలు ఎగిశాయి. వైఎస్సార్‌సీపీ నాయకుల భార్యలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు అతడిపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి డిమాండ్‌ చేశారు. ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తక్షణమే వాటిని వెనక్కి తీసుకోవాలని కోరుతూ బుధవారం డాక్టర్‌ గోపిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పట్టణంలో ర్యాలీ, మానవహారం, ధర్నా నిర్వహించారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా బయలుదేరి మల్లమ్మ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. బూతు కిట్టు రాధాకృష్ణ డౌన్‌ డౌన్‌, బూతుకిట్టు నశించాలి, డౌన్‌ డౌన్‌ సీఎం, రాధాకృష్ణ, పనికిమాలిన రాధాకృష్ణ డౌన్‌ డౌన్‌, ఏబీఎన్‌, ఆంధ్రజ్యోతి డౌన్‌ డౌన్‌, చంద్రబాబు డౌన్‌ డౌన్‌, కూటమి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి పల్నాడు రోడ్‌లోని పాత ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తూ రాధాకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలను పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాధాకృష్ణ వావివరసలు లేకుండా సీ్త్రలను అవమానపరిచారన్నారు. గతంలో నిజామాబాద్‌ జిల్లాలో దొంగ కిరోసిన్‌ అమ్ముకుంటూ బతుకుతూ, ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక చిరుద్యోగిగా చేరి చంద్రబాబు చేత పెట్టుబడులు పెట్టించి ఆ పత్రికనే కై వసం చేసుకుని చైర్మన్‌ అయ్యాడన్నారు. రాష్ట్రంలో ఎన్నో రకాల బ్రోకర్‌ పనులు చేసి పత్రికలో బూతులు రాశాడని, అతని పేరే బూతు కిట్టుగా సభ్యసమాజం ఆ పేరుతో పిలుచుకుంటుందన్నారు. అతను చేసిన వ్యాఖ్యలు మహిళ లోకానికి తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయని, తెలుగుదేశం పార్టీ పల్లకి మోస్తూ ఇటువంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని అన్నారు. అతనికీ ఒక కుటుంబం ఉందని, తక్షణమే మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

న్యూస్‌రీల్‌

సభ్య సమాజానికే సిగ్గు చేటు

డాక్టర్‌ సుధీర్‌భార్గవరెడ్డి మాట్లాడుతూ సంస్కృతిని మరిచి మహిళలను కించపరుస్తూ రాధాకృష్ణ చౌకబారుగా మాట్లాడడం సభ్యసమాజానికే సిగ్గుచేటన్నారు. రాధాకృష్ణ మాటలు వైఎస్సార్‌సీపీ నాయకులను బాధించాయన్నారు. జర్నలిజం పేరుతో ఇటువంటి మాటలు ఆ వృత్తికే కళంకం తీసుకొచ్చాయన్నారు. దీనిని జర్నలిజం అనుకోరని అన్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై వచ్చే ఆరోపణల నుంచి దృష్టి మళ్లించేందుకు ఇటువంటి ఎత్తుగడలు వేయటం వారికి ఆనవాయితీగా మారిందన్నారు. చేసిన వ్యాఖ్యలకు మహిళలు, పార్టీ నాయకులకు తప్పకుండా క్షమాపణలు చెప్పి తీరాలని హెచ్చరించారు. చిలకలూరిపేట, గురజాల నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, పడాల శివారెడ్డి, నకరికల్లు మండల కన్వీనర్‌ భవనం రాఘవరెడ్డి, ఇంటలెక్చ్యువల్‌ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఇయం స్వామి, రాష్ట్ర ఎస్‌సీ సెల్‌ కార్యదర్శి కందుల ఎజ్రా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ఎన్‌కే ఆంజనేయులు, గంటెనపాటి గాబ్రియేలు, జిల్లా రైతు, విద్యార్ధి విభాగాల అధ్యక్షులు అన్నెంపు న్నారెడ్డి, గుజ్జర్లపూడి ఆకాష్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి ఎస్‌.సుజాతాపాల్‌, జెడ్పీటీసీ సభ్యులు పదముత్తం చిట్టిబాబు, పట్టణ అధ్యక్షులు షేక్‌ కరిముల్లా, వర్కింగ్‌ అధ్యక్షులు అచ్చిశివకోటి, మాజీ ఎంపీపీ టి.మంగమ్మ, బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యంనాయీ, నియోజకవర్గ సోషల్‌ మీడియా కన్వీనర్‌ బూదాల కల్యాణ్‌, మైనార్టీ విభాగ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్‌ ఖాదర్‌బాష, నియోజకవర్గ అధ్యక్షులు షేక్‌ శిలార్‌, నరసరావుపేట, రొంపిచర్ల మండలాల కన్వీనర్లు తన్నీరు శ్రీనివాసరావు, కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ ఎస్‌సీ సెల్‌ ఉపాధ్యక్షుడు కుక్కల పౌలయ్య తదితర ఎస్‌సీ, ఎస్‌టీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలకు నిరసన

మహిళలకు వెంటనే రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి

ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ,

మానవహారం

పల్నాడురోడ్డులో ధర్నా చేసిన

డాక్టర్‌ గోపిరెడ్డి,

డాక్టర్‌ గజ్జల సుధీర్‌ భార్గవరెడ్డి

పల్నాడు రోడ్డులో పాత ఆంధ్రజ్యోతి కార్యాలయ కాంప్లెక్స్‌ ముందు రోడ్డుపై బైఠాయించిన డాక్టర్‌ గోపిరెడ్డి, డాక్టర్‌ గజ్జల తదితరులు

నరసరావుపేట మల్లమ్మ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడిన

నాయకులు, కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement