మంగళగిరి టౌన్: భద్రత ప్రమాణాలను పాటించని బస్సులను నిలిపి వేస్తామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. మంగళగిరి మండలం కాజ టోల్‌గేట్ వద్ద బుధవారం రాత్రి వాహనాల తనిఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాహనాల రికార్డులు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కొంతమంది బస్సు యజమానులు ఇష్టానుసారం వాణిజ్య సరుకులను తరలిస్తూ.. అధిక లోడ్‌తో బస్సులను నడుపుతున్నారని చెప్పారు. ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు.
మంత్రి రాంప్రసాద్‌రెడ్డి


