టీడీపీకి పరాభవం.. రెబల్‌ అభ్యర్థి విజయం | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి పరాభవం.. రెబల్‌ అభ్యర్థి విజయం

Apr 1 2026 8:36 AM | Updated on Apr 1 2026 8:36 AM

టీడీపీకి పరాభవం.. రెబల్‌ అభ్యర్థి విజయం ● సత్తెనపల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవికి గంగూరి అజయ్‌కుమార్‌, చిన్నం మణిబాబు, పూదోట సౌరిరాజులు ముగ్గురు పోటీ పడగా...చిన్నం మణిబాబు తన తండ్రి ఇటీవల మరణించటంతో ఆయన అందరినీ కలిసే అవకాశం లేక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఎన్నికలకు ఒక రోజు ముందుగానే అధికారికంగా ప్రకటించారు. దీంతో అధ్యక్ష పదవికి గంగూరి అజయ్‌ కుమార్‌, పూదోట సౌరిరాజు మాత్రమే పోటీ పడ్డారు. మొత్తం 171 మంది ఓటర్లకు గాను 168 మందికి ఓటు హక్కు ఉంది. 168 మంది ఓటర్లకు గాను 152 ఓట్లు పోలయ్యాయి. వీటిలో గంగూరి అజయ్‌కుమార్‌కు 104 ఓట్లు రాగా ప్రత్యర్ధి పూదోట సౌరిరాజుకు 40 ఓట్లు, బరి నుంచి తప్పుకున్న చిన్నం మణిబాబుకు 5 ఓట్లు వచ్చాయి. నోటాకు రెండు ఓట్లు రాగా.. ఒక ఓటు చెల్లలేదు. 64 ఓట్ల భారీ మెజార్టీతో గంగూరి అజయ్‌కుమార్‌ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉపాధ్యక్ష పదవికి సందెపోగు బాబురావు, గుజ్జర్లపూడి సురేష్‌బాబు పోటీ పడగా 168 ఓట్లకు గాను 152 ఓట్లు పోలయ్యాయి. రెండు ఓట్లు నోటాకు పడగా రెండు ఓట్లు చెల్లలేదు. గుజ్జర్లపూడి సురేష్‌బాబుకు 104 ఓట్లు రాగా ప్రత్యర్ధి సందెపోగు బాబూరావుకు 44 ఓట్లు వచ్చాయి. గుజ్జర్లపూడి సురేష్‌బాబు 60 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.జాయింట్‌ సెక్రటరీ పదవికి తిరుమల పూర్ణచంద్రరావు, కాశిమాల మార్క్‌ పోటీ పడగా 168 ఓట్లకు గాను 152 ఓట్లు పోలయ్యాయి. ఒక ఓటు నోటాకు పడగా కాశిమాల మార్క్‌కు 82 ఓట్లు రాగా ప్రత్యర్ధి తిరుముల పూర్ణచంద్రరావుకు 69 ఓట్లు వచ్చాయి. 13 ఓట్ల మెజార్టీతో కాశిమాల మార్క్‌ గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గెలుపొందిన ముగ్గురిని ఎన్నికల ప్రధాన అధికారి గుజ్జర్లపూడి మార్క్‌రావు, సహయ ఎన్నికల అధికారులు ఎమ్‌.ఏడుకొండలు, షేక్‌ నాగుర్‌బాబులు డిక్లరేషన్‌ పత్రాలను అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వ హించారు.గెలుపొందిన ముగ్గురు విజేతలను పలువురు న్యాయవాదులు ప్రత్యేకంగా అభినందించారు.కార్యక్రమంలో న్యాయవాదులు ఉన్నారు.

సత్తెనపల్లి: బార్‌ బరిలో రెబల్‌ అబ్యర్థిగా పోటీ చేసిన న్యాయవాది గంగూరి అజయ్‌కుమార్‌ 60 ఓట్ల భారీ మెజార్టీతో విజయదుందుభి మోగించాడు. రాజకీయాలకు అతీతంగా న్యాయవాదులు ఎన్నుకోవాల్సిన బార్‌ అసోసియేషన్‌ 2026–27 ఎన్నికలు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాత్రం సాధారణ ఎన్నికలను తలపించాయి. మునుపెన్నడూ లేని విధంగా అధికార పార్టీ ఎట్టకేలకు అధ్యక్ష పదవిని కై వసం చేసుకోవాలని టీడీపీ లీగల్‌ సెల్‌ ద్వారా ఒంటెత్తు పోకడ పోవడంతో అధికార పార్టీ నుంచి మరో బలమైన వ్యక్తి రెబల్‌గా ఎన్నికల్లో పోటీకి దిగాడు. ఇది మింగుడు పడని అధికార పార్టీ నాయకులు సర్వశక్తులు ఒడ్డి గెలుపొందాలని భావించినప్పటికీ వారి ఎత్తుగడ కాస్తా తిరగబడింది. అధికార కూటమికి ఘోరపరాభవం తప్పలేదు.

సత్తెనపల్లి బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన అజయ్‌కుమార్‌

ఫలించని అధికార పార్టీ,

టీడీపీ లీగల్‌ సెల్‌ వ్యూహాలు

ఉపాధ్యక్షుడిగా సురేష్‌బాబు,

జాయింట్‌ సెక్రటరీగా మార్క్‌ గెలుపు

ప్రశాంతంగా ముగిసిన సత్తెనపల్లి

బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement