పేద మనసు కోపింఛెన్‌ | - | Sakshi
Sakshi News home page

పేద మనసు కోపింఛెన్‌

Mar 23 2026 8:44 AM | Updated on Mar 23 2026 8:44 AM

సత్తెనపల్లి: జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు.. ప్రభుత్వం మంజూరు చేసే సామాజిక పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సంబంధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో కొత్త పింఛన్లు ఇవ్వడం లేదని, మళ్లీ రావాలని సచివాలయ ఉద్యోగులు చెబుతుండడంతో అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, వినుకొండ, గురజాల, మాచర్ల నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రజలు కొత్త పింఛన్లు కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వెరిఫికేషన్‌ పేరుతో ఇప్పటికే ఉన్న పింఛన్ల ఏరివేతకు చంద్రబాబు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో లబ్ధిదారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కొత్త పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను నిరంతరం కొనసాగించారు. ఇంటి వద్దకే వలంటీర్లు వచ్చి అర్హుల నుంచి అవసరమైన పత్రాలు స్వీకరించి కొత్త పింఛన్లు మంజూరు చేశారు. అనంతరం కూడా ఇంటి వద్దకే వచ్చి ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్‌ అందించారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. ప్రస్తుత ప్రభుత్వం అసలా వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయకుండా ఉద్దేశపూర్వకంగా ప్రజాసంక్షేమాన్ని నీరుగారుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకునేందుకు నిత్యం సచివాలయాలు, కార్యాలయాల చుట్టూ తిరగలేకపోతున్నామని అర్హులు ఆవేదన చెందుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌తో 2024 ఏప్రిల్‌ 18 నుంచి ప్రభుత్వ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. దీనివల్ల పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వెబ్‌సైట్‌ త్వరలో ఓపెన్‌ చేస్తారని లబ్ధిదారులకు అధికారులు చెబుతున్నారు. ఓపెన్‌ అయితే పింఛన్‌ అర్హులందరూ దరఖాస్తు చేసుకోవచ్చని, ఇప్పటికే పలు సమావేశాల్లో ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామని మండల స్థాయి అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో జిల్లాలోని పింఛన్లకు అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. అయితే టీడీపీకి చెందిన కొందరు నాయకులు తమ ప్రాంత ఎమ్మెల్యేలు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కొత్త పింఛన్ల కోసం అర్జీలు అందజేయిస్తున్నారు. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల వారీగా కేవలం టీడీపీకి సానుభూతిపరులుగా ఉండేవారు మాత్రమే దరఖాస్తులను అందిస్తున్నారు. మిగిలిన అర్హులు ఎంతోమంది ప్రభుత్వ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే దరఖాస్తు చేసుకోవచ్చని నిరీక్షిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

చంద్రబాబు ప్రభుత్వం తీరుపై అర్హుల తీవ్ర ఆగ్రహం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఓపెన్‌ కాని వెబ్‌సైట్‌ దరఖాస్తుకూ అవకాశం ఇవ్వని పాలకుల తీరుపై ఆవేదన వైఎస్సార్‌ సీపీ సర్కారు హయాంలో నిరంతరం మంజూరు జిల్లాలో భారీ సంఖ్యలో కొత్త పింఛన్‌లకు అర్హులు నిరుపేదలపై కనికరమైనా చూపని చంద్రబాబు ప్రభుత్వం

‘అధికారంలోకి రాగానే నూతన పింఛన్లు మంజూరు చేసి అర్హులందరికీ న్యాయం చేస్తాం .. పేదలకు అండగా ఉంటాం ..’ అంటూ ఎన్నికల ముందు కూటమి నాయకులు ఊదరగొట్టారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయకపోవడంపై వారు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు సర్కార్‌ కనీసం జాలి కూడా చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీ వచ్చిందంటే చాలు దరఖాస్తుకు అవకాశం వస్తుందేమోనని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నేటికీ సంబంధిత వెబ్‌సైట్‌ ప్రారంభం కాకపోవడంపై అర్హులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో సులువుగా...

వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తేనే...

భారీ సంఖ్యలో దరఖాస్తులు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement