మాచర్ల: జైలు నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తనపై చూపిన అభిమానానికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు పీఆర్కే కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ తాను జైలులో ఉన్నా తనకు, తన కుటుంబానికి మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అక్రమ కేసులో జైలులో ఉండి విడుదలై వచ్చిన సందర్భంగా రెండవ రోజు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయా మండలాల నుంచి భారీస్ధాయిలో తరలివచ్చి పీఆర్కేను కలసి అభినందనలు తెలిపారు. పార్టీ రాష్ట్ర ఎస్‌సీ విభాగ ప్రధాన కార్యదర్శి కనుమెల శ్యామ్యూల్, జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమెల మాణిక్యం, జిల్లా ఉపాధ్యక్షుడు కాలే మాణిక్యరావులతో పాటు ఆయా మండలాలకు చెందిన వారు భారీ స్థాయిలో వాహనాలలో తరలివచ్చి పీఆర్కేను శాలువాలతో సత్కరించారు. అందరినీ పీఆర్కే ఆప్యాయంగా పలకరించారు. పలు వివరాలడిగి తెలుసుకున్నారు. పీఆర్కేను సత్కరించిన వారిలో ఎస్‌సీ విభాగానికి చెందిన నియోజక వర్గ నాయకులు దరివేముల కిరణ్‌కుమార్, మాచర్ల ఏసుదాసు, కె. పాపయ్య, రాయపాటి నాగేశ్వరరావు, కందుకూరి మధు, జి. నాగేశ్వరరావు, ఎ. శేఖర్, నందిగం ఇస్సాకు, కందుకూరి సాగర్, కిన్నెర కిరణ్ తదితరులు ఉన్నారు. మాచర్ల జెడ్పీటీసీ మండ్లి పెద్ద మల్లుస్వామి, నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షులు బూడిద శ్రీను, జిల్లా కార్యదర్శి దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర యువజన సంఘం నాయకులు నవులూరి చెన్నారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి పోతురెడ్డి కోటిరెడ్డి, నియోజకవర్గ నాయకులు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, ఆయా విభాగ నియోజకవర్గ అధ్యక్షులు, ప్రజలు, మహిళా నాయకులు భారీ స్థాయిలో తరలివచ్చారు.


